Jumped Deposit Scam: రూ.5 వేలకు కక్కుర్తి పడితే లక్షలు పోతాయి.. ఈ కొత్త స్కాం గురించి తెలుసుకోండి

Jumped Deposit Scam: నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో ట్రిక్ తో జనాలను మోసం చేస్తున్నారు. లింకులు పంపిస్తూ డబ్బులు కొల్లగొట్టిన కేటుగాళ్లు ఇప్పుడు మరో కొత్త స్కాంకు తెర తీశారు. జంప్డ్ డిపాజిట్ స్కాం పేరుతో భారీగా నగదు కొల్లగొడుతున్నారు కేటగాళ్లు. అసలు ఈ జంప్డ్  డిపాజిట్ స్కామ్ అంటే ఏమిటి? దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

1 /8

Jumped Deposit Scam: సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త తరహా మోసాలకు ప్లాన్ చేస్తున్నారు. నయా ట్రిక్స్ తో సెకండ్ల వ్యవధిలోనే ప్రజల డబ్బులు దోచేందుకు కుట్రలు పన్నుతున్నారు. తాజాగా యూపీఐ  లక్ష్యంగా జంప్డ్  డిపాజిట్  పాల్పడుతున్నారు ఈ మాయదారి కేటుగాళ్లు. ఈ క్రమంలోనే జంప్డ్  డిపాజిట్ స్కాం అంటే ఏమిటి? దీన్ని ఎలా గుర్తించాలి పూర్తి వివరాలు తెలుసుకుందాం.  

2 /8

జంప్డ్ డిపాజిట్ స్కాం అంటే ఏమిటి  జంప్డ్ డిపాజిట్ స్కాం అనేది యూపీఐ ద్వారా మొబైల్ బ్యాంకింగ్ లక్ష్యంగా చేసుకుని మోసపూరిత స్కాం. ఈ స్కామ్ లో భాగంగా సైబర్ నేరగాళ్లు తమ నెంబర్ను ఉపయోగించి బాధితుడు ఖాతాలో ఐదు వేల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ డబ్బులు జమ చేస్తాడు. ఆ తర్వాత మీరు కొంత డబ్బును అందుకున్నారంటూ ఫోన్లో మీకు మెసేజ్ పంపిస్తారు. దానికిందే లింక్ పంపిస్తాడు.   మెసేజ్ ఓపెన్ చేసి యూపీఐ పిన్ నమోదు చేస్తాం. ఆ క్షణమే మోసగాళ్లు మనకు ఖాతాలో  విత్డ్రా అభ్యర్థనను ధ్రువీకరించినట్లే ఆ తర్వాత అకౌంట్ చేతికి యాక్సెస్ అవుతుంది. ఆ మోసగాడు స్వయంగా ఆ ఖాతాలోని డబ్బును యజమానిలా అధికారికంగా చేసుకుంటాడు. అకౌంటు గుర్తు తెలియని నెంబర్ ద్వారా చిన్న మొత్తాలు జమ అయ్యాయి అంటే అది మోసమే అని మీరు గ్రహించాలి.

3 /8

మీకు తెలియని యూపీఐ నెంబర్ నుంచి డిపాజిట్లు స్వీకరించినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు పోలీసులు హెచ్చరిస్తున్నారు. లేదంటే మీ అకౌంట్ లో ఉన్న డబ్బు సైబర్ మోసగాళ్లు కుల్లగొడతారని చెబుతున్నారు. జంప్డ్ స్కామ్ బారిన పడకుండా ఉండాలంటే  కొన్ని చిట్కాలు పాటించాలని సూచిస్తున్నారు.

4 /8

జంప్డ్ డిపాజిట్ స్కామ్' చాలా అప్రమత్తంగా ఉండాలి. మీకు తెలియని నెంబర్ల ద్వారా చిన్న మొత్తంలో డబ్బు జమ అయినప్పుడు చాలా జాగ్రత్త అవసరం. మీ ఖాతాలో డబ్బు జమ అయినట్లు మెసేజ్ రాగానే బ్యాలెన్స్ చెక్ చేసుకోకూడదు.

5 /8

అనుమానాస్పద నోటిఫికేషన్ లేదా మెసేజ్ వచ్చినట్టు గుర్తిస్తే కనీసం 15 నుంచి 30 నిమిషాల వరకు యూపీఐ వాడకుండా జాగ్రత్తపడాలి. ఇలా చేస్తే డబ్బు డ్రా కోసం సైబర్ కేటుగాళ్లు పంపిన రిక్వెస్ట్ కాలపరిమితి ముగిసిపోతుంది.  

6 /8

 ఏదైనా తెలియని నెంబర్ నుంచి మీ అకౌంట్ కు డబ్బులు వస్తే ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. బ్యాలెన్స్ చెక్ చేయడానికి ముందు మీ పిన్ నెంబర్ నమోదు చేయకుండా తప్పుడు నెంబర్ ఎంటర్ చేయండి. ఇలా చేస్తే సైబర్ కేటుగాళ్లు పంపించిన మెసేజ్  రిక్వెస్ట్ క్యాన్సిల్ అవుతుంది. దీంతో సైబర్ మోసగాడు ప్రయత్నానికి అడ్డుకట్ట వేసినట్లు అవుతుంది. ఆ తర్వాత నిజమైన పిన్ నెంబర్తో బ్యాలెన్స్ చెక్ చేసుకోండి.  

7 /8

తెలియని నెంబర్ నుంచి మెసేజ్ వచ్చినప్పుడు మీరు నేరుగా బ్యాంకు ని సంప్రదించండి. అప్పుడు మీకు డబ్బులు పంపిన ఖాతా  ప్రామాణికత ఏమిటో మీకు తెలిసిపోతుంది.  

8 /8

అలాగే మీ యూపీఐ పిన్ ను ఇతరులకు షేర్ చేయకూడదు. దాన్ని చాలా రహస్యంగా ఉంచుకోవాలి. ఇలాంటి చిట్కాలు పాటించినట్లయితే జంప్డ్ డిపాజిట్ స్కాం భారిన పడకుండా ఉండొచ్చు. ఒకవేళ మోసానికి గురైనట్లయితే.. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయండి. అలాగే  మీ అకౌంట్ ఉన్న బ్యాంకుకు జరిగిన విషయాన్ని తెలియజేయండి.