Kamadhenu: ఇంట్లో కామధేను విగ్రహం ఇక్కడ ఉంచితే మీ కోరికలన్నీ తీరుతాయి

Kamadhenu Idol Where To Placed In The House: హిందూ గ్రంథాల్లో.. చరిత్రలో కామధేనుకు అత్యంత ప్రాధాన్యం ఉంది. కామ ధేనువుగా దేవతా స్వరూపంగా భావిస్తారు. ఆవుతోపాటు చిన్న దూడ పాలు తాగుతున్న విగ్రహాన్ని కామధేను విగ్రహంగా పిలుస్తారు. ఈ విగ్రహం మీ ఇంట్లో ఉంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఏ దిశలో.. ఎక్కడ ఉంచాలో తెలుసుకోండి.

1 /9

గ్రంథాలు: మంధర పర్వతాన్ని ఉపయోగించి ఆదిశేషుని మద్దతుతో దేవతలు, రాక్షసులతో క్షీరసాగర మథనం నుంచి కామధేనుడు  బయటకు వచ్చాడని హిందూ గ్రంథాలు చెబుతున్నాయి.

2 /9

కోరికలు తీర్చే ఆవు: కామధేనువు అంటే కోరికలు తీర్చే ఆవుగా భావిస్తారు. కామధేనువు ఇంట్లో ఉన్నవారికి దేనికీ లోటు ఉండదని విశ్వాసం. అసురులు కామధేనుని తమ వద్ద ఉంచుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించగా.. దేవతలు పవిత్రమైన కామధేనువును తమ వద్ద ఉండేలా పోరాడారని పురాణ ఇతిహాసాల్లో ఉంది.

3 /9

దేవతా స్వరూపం: కామధేనువును దేవతా స్వరూపంగా కొలుస్తారు. కామధేనుడి విగ్రహం స్వచ్ఛత, సానుకూల శక్తి కలిగి ఉంటుంది. ఆవుతో పాటు చిన్న దూడ పాలు తాగుతున్న విగ్రహం ఇంట్లో ఉంటే ఆనందం, సమృద్ధి ఇంట్లో ఉంటుందని నమ్ముతారు.

4 /9

దేవతలు కొలువై: గో మాతలో 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉన్నారని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే హిందువులు ఆవును అత్యంత పవిత్రమైన జంతువుగా పూజిస్తారు. దేవత రూపంలో కొలుస్తూ పూజిస్తుంటారు.

5 /9

చెడు శక్తులు దూరం: కామధేనువు విగ్రహాన్ని ఇంట్లో ఏర్పాటుచేసుకోవడం ద్వారా అన్ని విధాలా సానుకూలంగా ఉంటుంది. చెడు శక్తులు దూరమవుతాయని నమ్మకం. కామధేనుడు ధనాన్ని ఆకర్షిస్తాడని ఈ విగ్రహం ఉంటే డబ్బుకు లోటు ఉండదని విశ్వాసం.

6 /9

చెడు గుణాలు: కామధేనువు విగ్రహం బయటి నుంచి ఇంట్లోకి డబ్బును ఆకర్షించడంతోపాటు చెడు గుణాలు ఉన్నవారిని ఇంట్లోకి రాకుండా నిరోధిస్తుందనే నమ్మకాలు ఉన్నాయి. ఈ కారణంగా ఇంట్లో కామధేనుడి విగ్రహాన్ని ఉండేలా చూసుకుంటారు.

7 /9

ఈ దిశలో: ఇంట్లో కామధేను విగ్రహాన్ని ఎటు వైపు ఏర్పాటుచేయాలనే సందేహాలు ఉంటాయి. ఇంటికి ఉత్తరం, ఈశాన్య లేదా తూర్పు దిశలో కామధేనువు విగ్రహం ఉంచాలి. దేవుడి గది లేదా ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర కామధేనువు విగ్రహాన్ని ఉంచవచ్చు.

8 /9

ఈ లోహలతో: కామధేనువు విగ్రహాన్ని వెండి, ఇత్తడి లేదా రాగి లోహంతో తయారు చేయాలి. ఈ విగ్రహం ఆరోగ్యం, సంపద, శ్రేయస్సు, శాంతి, విజయాన్ని ఇస్తుందని హిందూవులు విశ్వసిస్తారు.

9 /9

గమనిక: ఈ కథనం మతపరమైన సమాచారంపై ఆధారపడింది. జీ తెలుగు న్యూస్ ఈ విషయాన్ని ధృవీకరించలేదు.