Kangana Ranaut: ఇంద్ర భవనం లాంటి ఇల్లు అమ్మడానికి పెట్టిన బాలీవుడ్ హీరోయిన్..? ధర తెలిస్తే మైండ్‌ బ్లాకే..!

Kangana Ranuat House In Bandra Photos: బాలీవుడ్‌ బ్యూటీ తన ఇంద్ర భవనంలాంటి ఇంటిని అమ్మకానికి పెట్టిందనే వార్తలు ఈరోజు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ముంబైలోని బాంద్రాలోని ఈ ఇల్లు ఎవరిది? ఎంత? తెలుసుకుందాం.
 

1 /7

బాంద్రాలోని పాలి హిల్స్‌ ఏరియాలోని ఇంటిని బాలీవుడ్‌ హిరోయిన్‌ అమ్మకానికి పెట్టిందనే వార్తలు ఉదయం నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ బంగ్లాను కంగనా తన మణికర్ణిక ఫిల్మ్స్‌ ప్రొడక్షన్‌ ఆఫీస్‌గా ఉండేది.  

2 /7

అయితే, కంగనా హిమాచల్‌ ప్రదేశ్‌ ఎంపీగా గెలిచిన తర్వాత తన ఎక్కువ సమయాన్ని న్యూఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్‌లోనే గడపాల్సి వస్తోంది. అందుకే ముంబై బాంద్రాలోని ఈ ఇంటిని రూ. 40 కోట్లకు అమ్మకానికి పెట్టందనే వార్తలు వినిపిస్తున్నాయి.   

3 /7

ఈ వార్తకు సంబంధించిన వీడియో ఓ యూట్యూబ్‌ పేజీ వెలువరించింది. రెండు అంతస్తుల ఈ ప్లాట్‌ 285 స్క్వేర్‌ మీటర్లు ఉండగా 3,042 స్క్వేర్‌ ఫీట్లలో బిల్డింగ్‌ నిర్మాణం జరిగింది. ఈ ఇంటిది అదరనంగా 500 స్క్వేర్‌ ఫీట్ల పార్కింగ్‌ స్థలం కూడా ఉంది.    

4 /7

అయితే, గతంలో ఈ బిల్డింగ్‌ను అంటే 2020 లో బీఎంసీ (Brihanmumbai Municipal Corporation) నిబంధనలకు అతిక్రమించిన ఇంటి నిర్మాణం చేపట్టారని పాక్షికంగా కూల్చివేసింది. బాంబే హైకోర్టు నుంచి స్టే ఆర్డర్‌ రాగానే ఈ కూల్చివేతలు నిలిపివేశారు. దీనిపై కంగాన బీఎంసీపై కేసు వేసి, రూ. 2 కోట్ల పరిహారాన్ని కూడా కోరారు  

5 /7

ఇదిలా ఉండగా ఇటీవలి లోక్‌ సభ ఎన్నికల్లో కంగాన రనౌత్‌  హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి నుంచి ఎంపీగా గెలిచారు. ఇక ఈమె నటించిన చిత్రం ' ఎమర్జెన్సీ' సెప్టెంబర్‌ 6 న విడుదల కానుంది.  

6 /7

అయితే, కంగాన రనౌత్‌కు చెందిన ఈ మణికర్ణిక ఫిల్మ్స్‌ ఆఫీసును షబ్నం గుప్తా డిజైన్ చేశారు. రెండు మూడు కార్లు ఈజీగా పార్కింగ్‌ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. ఈ ఇంటి మెట్లు కూడా చెక్కతో చేసి ఉన్నాయి. చూడటానికి లగ్జరీయస్‌గా ఉంది.  

7 /7

సౌండ్‌ ప్రూఫ్ ఎడిటర్‌ రూమ్‌ పింక్‌ కలర్‌లో డిజైన్‌ చేసి ఉంది. దీనికి ఫ్రెంచ్‌ డోర్స్‌, చెక్క డెస్క్‌లు, ఫర్నిచర్‌ ఉంది అయితే ఆ యూట్యూబ్‌ ఛానల్‌ కంగనా పేరును ప్రస్తావించలేదు కానీ, బీఎంసీ ఈ ఇంటిని కూల్చివేసినప్పటి నుంచి బాగా వైరల్ అయింది. దీంతో ఈ బిల్డింగ్‌ చూడగానే ఎవరైనా గుర్తించేయవచ్చు.