Keerthy Suresh: ఆ హీరోనే నాకు సెట్ అవుతాడు.. కీర్తి సురేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Keerthy Suresh Movies: కీర్తి సురేష్ కి సౌత్ ఇండియాలో.. ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో మలయాళీ, తమిళ సినిమాలలో నటించి మెప్పించిన.. ఈ హీరోయిన్.. తిరుమల కిషోర్ దర్శకత్వంలో వచ్చిన నేను శైలజా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది. సినిమాలతోనే.. కాకుండా తన ఇంస్టాగ్రామ్ ద్వారా.. అలానే తన ఇంటర్వ్యూల ద్వారా కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.. ఈ అమ్మాడి. 

1 /5

కీర్తి సురేష్ గురించి సౌత్ ఇండియా ప్రేక్షకులకు.. ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. మలయాళంలో ఎన్నో సినిమాలు చేసి.. తనకంటూ ప్రత్యేక స్థానం.. సంపాదించుకున్న ఈ హీరోయిన్.. ఆ తరువాత తమిళంలో.. కూడా ఎన్నో సినిమాల్లో కనిపించే మెప్పించింది.   

2 /5

ఇక తెలుగులో తిరుమల కిషోర్ దర్శకత్వంలో.. రామ్ హీరోగా చేసిన నేను శైలజా సినిమా ద్వారా.. తెరంగేట్రం చేసింది. మొదటి సినిమాతోనే.. మంచి విజయం సాధించింది ఈ హీరోయిన్. ఆ తరువాత నానితో కలిసి నటించిన నేను లోకల్.. సినిమా కూడా కీర్తి సురేష్ కి.. మరో విజయాన్ని అందించింది 

3 /5

అయితే కీర్తి సురేష్ కి మర్చిపోలేని పేరు తెచ్చిపెట్టింది మాత్రం.. మహానటి చిత్రం. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో.. కనిపించి నిజంగానే మహానటి అనిపించుకుంది. అంతేకాదు ఈ చిత్రానికి గాను కీర్తి సురేష్ కి..నంది అవార్డు సైతం వచ్చింది. ఇక మహానటి తరువాత తమిళ, తెలుగులో వరస అవకాశాలు అందుకుంటూ.. దూసుకుపోయింది. 

4 /5

ఈమధ్య నానితో నటించిన దసరా సినిమా కూడా కీర్తి సురేష్ కి మంచి పేరు తెచ్చి పెట్టింది. త్వరలోనే బేబీ జాన్.. అనే హిందీ సినిమాతో బాలీవుడ్ లోకి సైతం ఎంట్రీ ఇవ్వనుంది. ఈ క్రమంలో ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో.. కీర్తి సురేష్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి

5 /5

అసలు విషయానికి వస్తే ఒక ఇంటర్వ్యూలో.. కీర్తి సురేష్ ని మీకు సరిపోయే హీరో ఎవరు అని అడగగానే.. నాకు తెలిసి నేను జూనియర్ ఎన్టీఆర్.. సరైన జోడిగా ఉంటాము అంటూ చెప్పుకొచ్చింది. ‘నేను జూనియర్ ఎన్టీఆర్ గారిని మహానటి.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో మొదటిసారి కలిశాను.. అప్పుడే మేమిద్దరం సినిమా చేస్తే తప్పకుండా పర్ఫెక్ట్ పెయిర్ గా ఉంటాము అనుకున్నాను.. మహానటి సక్సెస్ అయిన తర్వాత మొదటి రోజే.. ఆయన మా టీం అందరికీ..ఇంటికి పిలిచి మరి పార్టీ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా మంచి వ్యక్తి’.. అంటూ చెప్పుకొచ్చింది ఈ హీరోయిన్

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x