Keerthy suresh: మరో బాంబు పేల్చిన మహానటి.. కల్కీ 2898 AD ఆ రోల్ విషయంలో సెన్సెషనల్ కామెంట్స్..

Keerthy Suresh: కీర్తి సురేష్ ఇటీవల సన్సెషనల్ కామెంట్లు చేయడంతో ఎక్కువగా వార్తలలో ఉంటున్నారు. ఇటీవల ఆమె మాట్లాడుతు.. తాను సింగిల్ అని చెప్పలేదుగా.. అంటూ ఒక బాంబు వేశారు. తాజాగా, ఆమె కల్కీ 2898 AD పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

1 /6

నటి కీర్తిసురేష్ ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తలలో ఉంటున్నారు. కల్కీ మూవీ 2898 AD గురించి ఆమె చేసిన కామెంట్లు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి. కల్కీ 2898 AD  సినిమాలో కీర్తిసురేష్ ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ తో తయారు చేసిన బుజ్జీ అనే రోబోకి ఆమె వాయిస్ ఓవర్ ఇచ్చారు.

2 /6

కల్కీ మూవీలో బుజ్జీ చేసిస హల్ చల్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతేకాకుండా.. ఆ రోబోకు కీర్తి సురేష్ వాయిస్ కూడా పక్కా సూట్ అయ్యింది. ఈ క్రమంలో.. కీర్తిసురేష్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కల్కీ మూవీలో దర్శకుడు నాగ్ అశ్విన్ తొలుత తనకు ఒక రోల్ ఆఫర్ చేశారని చెప్పుకొచ్చింది.

3 /6

కల్కీ మూవీలో బుజ్జీకి వాయిస్ కు ముందు.. ఆ సినిమాలో ఒక రోల్ లో నటించాలని నాగ్ అశ్విన్ అడిగారంట. కానీ కీర్తిసురేష్ మాత్రం.. ఆ రోల్ చేయడానికి అంతగా ఆసక్తి చూపించలేదంట. కానీ ఆ మూవీలో భాగం కావడం ఇష్టమేనని మాత్రం మెస్సెజ్ చేసిందంట.

4 /6

దీంతో నాగ్ అశ్విన్ ఆ తర్వాత బుజ్జీకి వాయిస్ ఓవర్ ఇవ్వాలని కోరారంట. అంతేకాకుండా..ఈ వాయిస్ ఓవర్ విషయంలో .. నాగ్ అశ్విన్ కీర్తీసురేష్ కు ఎంతో సపోర్ట్ చేశారంట. ఈమూవీలో రోల్ చేయనందుకు కాస్తంతా బాధపడిన.. బుజ్జీకి వాయిస్ ఇవ్వడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని మహానటి చెప్పుకొచ్చింది.

5 /6

ఇప్పుడైతే.. కల్కీ మూవీ పార్ట్ 2 కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నానని కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కీర్తీ సురేష్ రఘుతాతా మూవీ ప్రమోషన్స్ లలో బిజీ బిజీగా ఉంటుంది. ఈ సినిమా ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజున విడుదల కానుంది. 

6 /6

ఒకవైపు ఈ మూవీ ప్రమోషన్స్ చేస్తునే మరోవైపు.. కీర్తీ సురేష్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న బేబీ జాన్ మూవీ అప్ డేట్ ను కూడా అభిమానులతో పంచుకుటుంది. దీనిలో వరుణ్ ధావన్ కు జోడిగా కీర్తి సురేష్ నటిస్తోంది.