Kerala Lottery: అదృష్టం అనేది ఎవరికి ఎప్పుడు ఎలా ఉంటుందో అంచనా వేయలేం. అందరికీ ఎప్పుడో ఒకప్పుడు అదృష్టం వరిస్తుందని పెద్దలంటుంటారు. ఎవరి అదృష్టం సంగతి ఎలా ఉన్నాకేరళలో జరిగిన ఆ ఘటన అదృష్టం పట్టడమంటే ఎలాగుండాలో చెబుతోంది.
Kerala Lottery: సాధారణంగా మనం అదృష్టం అంటే అలాగుండాలి అంటుంటాం. ఈ మాట నూటికి నూరుశాతం నిజమైంది కేరళలో. 11 మంది పారిశుద్ధ్య కార్మిక మహిళలకు పట్టిన అదృష్టమది. కేవలం 250 రూపాయల టికెట్ 10 కోట్లను అందించింది. ఎలాగో చూద్దాం..
వాస్తవానికి గత ఏడాది కూడా ఈ 11 మంది మహిళలు డబ్బులు పోగుచేసుకుని ఓనమ్ బంపర్ టికెట్ కొన్నారు. అప్పుడు వీరికి 7500 రూపాయలు వచ్చాయి. అందరూ సమానంగా ఈ డబ్బులు పంచుకున్నారు. అందుకే ఈసారి మాన్సూన్ బంపర్ టికెట్ కొనాలన్పించిందంటున్నారు
ఈ 11 మందిలో చాలామంది మహిళలకు రుణాలున్నాయి. కుమార్తెల పెళ్లి చేయాల్సి ఉంది. కుటుంబీకుల చికిత్స ఖర్చులున్నాయి. చిన్న చిన్న ఇళ్లలో నివసించే ఈ కార్మికులంతా చాలా కష్టాలు ఎదుర్కొంటున్నవాళ్లే.
మలప్పురం కార్పొరేషన్ కు చెందిన హరిత కర్మ సేనలో ఈ మహిళలు పనిచేస్తుంటారు. ఈసారి తమకు అదృష్టం వరించిందని ఆనందపడుతున్నారు.
ఈ పారిశుద్ధ్య మహిళా కార్మికులకు జీతం 7500 రూపాయల్నించి 14 వేల వరకూ అందుతుంది. ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరిస్తుంటారు.
లాటరీ తగిలిందని తెలియగానే ఆ మహిళల ఆనందానికి అంతు లేకుండా పోయింది. సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల్ని ఈ డబ్బులతో పరిష్కరించుకుంటామంటున్నారు.
ఆ మహిళలు కొనుగోలు చేసిన టికెట్కు 10 కోట్లు లాటరీ వచ్చినట్టు కేరళ లాటరీ విభాగం ప్రకటించింది. 250 రూపాయల లాటరీ టికెట్ కొనేందుకు ఆ మహిళల వద్ద అంత డబ్బు లేకపోతే 11 మంది కలిసి కొనుగోలు చేశారు.
కేరళ స్టేట్ లాటరీకు చెందిన ఆ టికెట్ ఖరీదు 250 రూపాయలు. ఆ పారిశుద్ధ్య మహిళా కార్మికులు మలప్పురం కార్పొరేషన్లో పనిచేసేవాళ్లు.
అదృష్టం ఒక్కోసారి అందర్నీ బలంగా తడుతుంది. ఒక్కోసారి కొందరినే వరిస్తుంటుంది. కేరళ రాష్ట్రంలో 11 మంది పారిశుద్ధ్య మహిళా కార్మికులు కలిసి కేరళలో 250 రూపాయలు పోగు చేసుకుని లాటరీ టికెట్ కొన్నారు. ఈ లాటరీ ఆ మహిళలకు 10 కోట్ల జాక్ పాట్ అందించింది. ఈ టికెట్ కోసం ఒక్కొక్కరు 25 రూపాయల కంటే తక్కువే ఇవ్వడం విశేషం.