Gold Rate: ఈ కొత్త ఏడాదిలో బంగారం కొనలేమా? రికార్డు స్థాయికి గోల్డ్ రేట్స్..ఎంత పెరుగుతుందో తెలిస్తే షాకే

Gold Rate: బంగారానికి, భారతీయులకు మధ్య ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బంగారాన్ని భారతీయులు ఒక సెంటిమెంట్ గా భావిస్తారు. మన ఇళ్లలో ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. దాంతో బంగారం కొనాల్సి వస్తుంది. మరి కొత్త సంవత్సరం ధరలు ఎలా ఉంటాయి. బంగారం ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

1 /7

Gold Rate: కొత్త సంవత్సరం వచ్చేసింది. మరి ఈ 2025లో బంగారం ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా?  ఈ సందేహం చాలా మందిలో ఉంటుంది. కొంతమంది తమ తమ అంచనాలు వేసుకొని తగ్గుతాయని అంటుంటే.. మరికొందరు లేదు లేదు పెరుగుతాయని అంటున్నారు. ఇలా నలుగురు నాలుగు రకాలుగా చెబుతూనే ఉన్నారు. ఎవరి మాట నమ్మాలో మనకు అర్థం కాదు. దాంతో కొత్త ఏడాది బంగారం కొనాలా వద్దా అనే సందేహం చాలా మందిలో  ఉంటుంది. అందువల్ల ఇప్పుడు మనం కొన్ని ఖచ్చితమైన పారామీటర్తో 2025లో బంగారం ధరలు ఎలా ఉంటాయో చూద్దాం. 

2 /7

భారత్లో అక్టోబర్ 2024లో 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర 10 గ్రాములకు 81,300 కు చేరింది. భారతదేశంలో ఇది అత్యధిక ధర. ఆ తర్వాత బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర 10 గ్రాములకు 77,560 రూపాయలు ఉంది. అలాగే 22 క్యారెట్ల  బంగారం ధర 10 గ్రాములకు 71,100 పలుకుతుంది. ఈ ధర 2025లో భారీగా పెరగబోతుందని ప్రపంచ బులియన్ మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.  

3 /7

బంగారం ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రపంచంలో అనిశ్చితి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. రష్యా ఉక్రేయిన్  యుద్ధం, గల్ఫ్ లో ఇజ్రాయిల్ సిరియా టెన్షన్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిల్లో సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అయినా బంగారంపై పెట్టుబడులు పెరుగుతున్నాయి. అందువల్ల 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర 10 గ్రాములకు 85వేల నుంచి 90 వేల వరకు పెరగవచ్చు అని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.  

4 /7

రష్యా, చైనా లాంటి దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తున్నాయి. వందల టన్నుల కొద్ది బంగారాన్ని కొంటున్నాయి. డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక.. ఈ దేశాలపై ఆంక్షలు పెట్టే అవకాశం ఉంది. వాటిని తట్టుకోవాలంటే బంగారం అవసరం. అందుకే ఆ రెండు దేశాలు బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తున్నాయి. ఫలితంగా బంగారంకు డిమాండ్ పెరిగి.. ధర కూడా పెరుగుతుంది.  

5 /7

 ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు అస్సలు బాగోలేవు. ఏ దేశము అద్భుతంగా లేదు. అందువల్ల పెట్టుబడులపై వడ్డీ రేటు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రిటర్న్స్ తగ్గితే ఆటోమేటిగ్గా బంగారం వైపు చూస్తారు పెట్టుబడిదారులు. అందువల్ల బంగారం ధరలు పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది.  

6 /7

భారతదేశంలో రూపాయి విలువ అంతకంతకు తగ్గుతూనే ఉంది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక మరింత తగ్గినా ఆశ్చర్యం లేదు. అందువల్ల దేశీయంగా బంగారం ధరలు మరింత పెరుగుతాయి. ఇదివరకటి కంటే బంగారం ధర ఎక్కువ చెల్లించాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది.  

7 /7

అయితే ఇవన్నీ ఇప్పటివరకు ఉన్న అంచనాలు మాత్రమే. సరిగ్గా ఇలాగే జరుగుతుందని మనం చెప్పలేము. ఏ దేశంలోనైనా అనుకోని  భారీ బంగారు నిక్షేపాలు లభించినట్లయితే ధరలు తగ్గి అవకాశం ఉంటుంది. కానీ వీలైనంతవరకు ధరలు పెరిగే అవకాశాలు ఎక్కువగా  ఉన్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.