Gold Rate Today: బంగారం ధర భారీగా పెరుగుతోంది. పసిడి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. తులం బంగారం ఏకంగా లక్ష రూపాయలు దాటి ముందుకు వెళ్ళిపోయింది అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో జూన్ 19వ తేదీ గురువారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,02,440 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 92,900 పలికింది.
Ahmedabad Plane Crash: ఎయిరిండియా విమాన ప్రమాదం వందలాది కుటుంబాల్లో తీవ్ర దుఃఖాన్ని మిగుల్చింది. ఈ ఘటన ఇది బీమా కంపెనీలకు మానవీయ, ఆచరణాత్మక సవాలును కూడా విసిరింది. మరణించిన వారి కుటుంబాలకు న్యాయం అందించడానికి క్లెయిమ్‌లను పరిష్కరించడంలో సున్నితత్వం, సత్వరమార్గాన్ని చూపించడం ఇప్పుడు బీమా నియంత్రణ సంస్థలు, కంపెనీల బాధ్యత. భవిష్యత్తుకు ఒక పాఠం ఏమిటంటే, బీమా పాలసీని తీసుకునేటప్పుడు, నామిని, వారసత్వాన్ని స్పష్టంగా, మల్టిపుల్ ఆప్షన్స్ తో నిర్ణయించడం చాలా అవసరం.
Gold Rate Today: నిన్నటితో పోల్చి చూస్తే నేను బంగారం ధర స్వల్పంగా తగ్గింది. జూన్ 18వ తేదీ బుధవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,01,870 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 92,400గా ఉంది. ఒక కేజీ వెండి ధర రూ. 1,11,800గా ఉంది.
EPFO Update: ఈపీఎఫ్ఓ తమ చందాదారులకు థర్డ్ పార్టీ సర్వీసుల పట్ల అలర్ట్ గా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. పీఎఫ్ సేవలు ఉచితమని..అధికారిక పోర్టల్, ఉమంగ్ యాప్ ద్వారానే పొందాలని సూచించింది. థర్డ్ పార్టీలు మీ కీలక సమాచారాన్ని దుర్వినియోగం చేస్తాయి. ఫిర్యాదులు ఎలా చేయాలో కూడా వివరించింది. ఇటీవల ఈపీఎఫ్ సేవలు మరింత సులభతరం చేసినట్లు పేర్కొంది.
Gold Rate Today: పసిడి ప్రియులకు బంగారం ధరలు కాస్త ఊరటనిచ్చాయి. అంతర్జాతీయంగా బలహీనమైన డిమాండ్ కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 170 తగ్గింది. దీంతో తులానికి రూ. 1,01,370కి చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 తగ్గి రూ. 1,00, 550కి చేరింది.
JP Morgan Advice: ZEE ప్రమోటర్ గ్రూప్ కంపెనీలో రూ. 2,237 కోట్ల పెట్టుబడి చేయనుంది. ఇది కంపెనీ చరిత్రలో ఒక భారీ పరిణామంగా పేర్కొంటున్నారు. ఈ చర్య ద్వారా కంపెనీ ప్రిఫరెన్షియల్ బేసిస్ (Preferential Basis) పై కన్వర్టిబుల్ వారంట్ల (Convertible Warrants) రూపంలో కంపెనీలో ఈ పెట్టుబడి పెట్టనుంది.
Indonesian currency: 1992 నుండి ప్రారంభమైన నోట్ సిరీస్‌లో రూపాయి కరెన్సీపై గణేశుడి బొమ్మ ఉన్న ఏకైక ముస్లిం మెజారిటీ దేశం ఇండోనేషియా. ఈ దేశం హిందూ సంస్కృతి, రామాయణం, మహాభారతం వంటి గ్రంథాలను దాని సాంస్కృతిక వారసత్వంగా భావిస్తుంది. ఇక్కడ తోలుబొమ్మలాట కళ, చారిత్రక సంబంధాలు భారతదేశంతో ముడిపడి ఉన్నాయి. అయితే ఈ నోట్లు నేడు చెలామణిలో లేవు. కానీ సాంస్కృతిక వారసత్వం, సేకరణలో భాగంగా మాత్రమే ఉన్నాయి.
Gold Rate Today: బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. నేడు జూన్ 16వ తేదీ సోమవారం బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,01,670 పలుకుతుండగా..22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 93,130 పలుకుతోంది. కిలో వెండి ధర రూ. 1,19, 900 పలుకుతోంది. బంగారం ధరలు ఆల్ టైం రికార్డ్ స్థాయి దగ్గర ట్రేడ్ అవుతున్నాయి.
Upcoming Cars in India: ఈ ఏడాది మహీంద్రా, విన్‌ఫాస్ట్ వంటి కొత్త కంపెనీలు ఆటో మార్కెట్లో కొత్త మోడళ్లను ప్రవేశపెట్టడానికి సిద్ధం అవుతున్నాయి. ఈ సంవత్సరం పండుగ సీజన్‌లో విడుదల కానున్న కొత్త కార్ల జాబితాను ఇప్పుడు చూద్దాం.
Gold Rate Today: పసిడి ప్రియులను బంగారం ధర వణికిస్తోంది. బంగారం కొనుగోలు చేయాలంటేనే భయంతో వణికిపోయేలా చేస్తోంది. అంతర్జాతీయంగా నెలకున్న అనిశ్చిత పరిస్థితులు, యుద్ధ భయాలు కమ్ముకుంటున్న క్రమంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. తులం బంగారం ధర లక్ష మార్క్ దాటింది. నాలుగు రోజుల్లో తులం బంగారం ధర రూ. 4వేలకు పైగా పెరిగింది. ఈ క్రమంలోనే నేడు జూన్ 15వ తేదీ ఆదివారం బంగారం ధర ఎంత ఉందో తెలుసుకుందాం.
Air India Plane Crash: ఎయిరిండియా విమాన ప్రమాదం తర్వాత ప్రభుత్వ బీమా సంస్థ ఎల్‌ఐసి ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులు బీమా క్లెయిమ్ కోసం మరణ ధృవీకరణ పత్రాన్ని అందించాల్సిన అవసరం లేదని వెల్లడించింది. బదులుగా ప్రభుత్వం లేదా ఎయిర్ ఇండియా జారీ చేసిన ఏదైనా అధికారిక పత్రం లేదా పరిహారం చెల్లింపు రుజువు చెల్లుబాటు అవుతుందని పేర్కొంది.
Germany succession crisis: జర్మనీలో ఒక వింత సంక్షోభం తలెత్తింది. అక్కడ 2.31 లక్షల వ్యాపార సంస్థలు మూసివేత అంచున ఉన్నాయి. ఎందుకంటే ఈ సంస్థలను నడుపుతున్న వ్యక్తులు వృద్ధులయ్యారు. వారు తమ కంపెనీని నడపడానికి వారసులు లేకపోవడంతో చాలా వ్యాపార సంస్థలు మూసివేత అంచున ఉన్నాయి.
Gold Rate Today: బంగారం ధరలు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. ఆల్ టైం రికార్డు స్థాయి నుంచి నెమ్మదిగా తగ్గుతున్నాయి. జూన్ 8వ తేదీ ఆదివారం నాడు బంగారం ధరలు గమనించవచ్చు. ఆల్ టైం రికార్డు స్థాయితో పోల్చితే బంగార ధరలు దాదాపు రూ. 3వేలు తక్కువగా తగ్గాయి. బంగారం ధరలు తగ్గుతున్న నేపథ్యంలో ఆభరణాలు కొనుగోలు చేసే వారికి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. ప్రస్తుతం బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Post Office Scheme: పోస్ట్ ఆఫీస్ స్కీము ద్వారా మీరు పెట్టిన డబ్బుకు రెండింతలు రాబడి రావాలి అనుకుంటున్నారా. అయితే ఓ చక్కటి స్కీం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ స్కీం ఉపయోగించి మీరు మీ డబ్బును పోస్టాఫీసులో పొదుపు చేసి రెండింతలు చేసుకోవచ్చు.
Money Planning: ప్రస్తుత కాలంలో ఒక కోటి రూపాయలు లేదా కోటీశ్వరుడు అనేది మీకు ఒక ఆర్థిక భద్రతను అందిస్తుంది. ఒక కోటి రూపాయలతో బలం స్వేచ్ఛగా జీవితాన్ని గడిపే అవకాశం లభిస్తుంది. మీరు 30వ ఏట నుంచి మదుపు చేయడం ప్రారంభిస్తే 60 ఏళ్ళు వచ్చే నాటికి ప్రతి నెల ఎంత మదుపు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Donald Trump Tesla S car price: ఎలోన్ మస్క్ తో స్నేహం చెడిన నేపథ్యంలో.. డొనాల్డ్ ట్రంప్ తన టెస్లా కారును అమ్మాలని నిర్ణయించుకున్నారు. ఈ ఎరుపు రంగు కారు చాలా రోజులుగా వైట్ హౌస్ లో పార్క్ చేసి ఉంది. అయితే ఈ కారును ఇప్పుడు ట్రంప్ అమ్మకానికి పెట్టినట్లు సమాచారం. ఈ కారు ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
Silver Rates: సామాన్యులు అందుకోలేని స్థాయికి బంగారం ధరలు పెరిగిపోతున్నాయి. మరోవైపు తగ్గేదేలే అంటూ వెండి ధరలు కూడా రికార్డులను క్రియేట్ చేస్తోంది. తాజాగా వెండి ధర 13ఏళ్ల రికార్డును తిరిగరాసింది. దేశీయ డిమాండ్ పెరగడం, ప్రపంచ ప్రభావాల కారణంగా వెండి ధరలు పెరిగాయని వ్యాపారులు తెలిపారు
RBI Interest Rates: రుణగ్రహీతలకు ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ముచ్చటగా మూడోసారి కీలక వడ్డీరేట్లను తగ్గించింది. 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
Gold Rate Today: బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. గురువారం 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ. 91,300 రూపాయలు ఉంది. 10 గ్రాముల 24క్యారెట్ల గోల్డ్ రేట్ 99,600 ఉంది. 10 గ్రాముల 18 క్యారెట్ల పసిడి ధర రూ. 74,700 వద్ద ట్రేడ్ అయ్యింది. నేడు జూన్ 6వ తేదీ శుక్రవారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Narayana Murthy: కేవలం ఒకటిన్నర సంవత్సరాల వయసులో నారాయణ మూర్తి మనవడు ఏకగ్రహ రోహన్ మూర్తికి ఇన్ఫోసిస్‌లో రూ.240 కోట్ల విలువైన షేర్లను బహుమతిగా ఇచ్చారు. ఇది అతనికి రూ.6.5 కోట్ల డివిడెండ్ ఇచ్చింది. దీనితో అతను భారతదేశంలోని అతి పిన్న వయస్కులలో ఒకరిగా నిలిచాడు. ఇన్ఫోసిస్ ప్రకటించిన డివిడెండ్ నుండి మూర్తి కుటుంబం కోట్ల రూపాయల లాభాన్ని పొందింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.