Kia Clavis: మార్కెట్‌లో మరో పవర్‌ ఫుల్‌ SUV వచ్చేస్తోంది.. Kia Clavis సంచలనం సృష్టించబోతోందా?

Kia Clavis Lunch Soon: మార్కెట్‌లోకి రాబోయే కొత్త కియా క్లావిస్‌ SUV అనేక రకాల కొత్త ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది శక్తివంతమైన ఇంజన్‌తో రాబోతున్నట్లు సమాచారం. అయితే ఈ కారుకు సంబంధించిన కొన్ని ఫీచర్స్‌ సోషల్‌ మీడియాలో లీక్‌ అయ్యాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

 

Kia Clavis Lunch Soon: అతి త్వరలోనే ఆటో మొబైల్‌ కంపెనీ కియా తమ కొత్త SUV క్లావిస్‌ని ప్రవేశపెట్టబోతోంది. లాంచింగ్‌కి ముందే ఈ కారుకు సంబంధించిన ఫీచర్స్‌, ధర వివరాలు సోషల్‌ మీడియాలో లీక్‌ అయ్యాయి. ఈ  SUV అనేక రకాల శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో మార్కెట్‌లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1 /7

క్లావిస్ SUV కారును కియా స్పోర్టీ లుక్‌లో లాంచ్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది ఆకర్శనీయమైన డిజైన్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీని ముందు భాగంలో LED హెడ్‌ల్యాంప్‌లు, డే-టైమ్ రన్నింగ్ లైట్‌లు కలిగి ఉంటుంది. వెనుక భాగంలో LED టెయిల్‌ల్యాంప్‌లు ఉంటాయి. అంతేకాకుండా ఒక రూఫ్ స్పాయిలర్  కూడా కలిగి ఉంటుంది. 

2 /7

క్లావిస్ SUV రెండు ఇంజన్స్‌లో అందుబాటులోకి రాబోతోంది. ఇందులో మొదటిది మోడల్‌ 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులోకి వస్తే రెండవది  1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌తో రాబోతోంది.

3 /7

టర్బో-పెట్రోల్ ఇంజన్ 150 PS శక్తినితో పాటు 250 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని లీక్‌ అయిన వివరాల్లో పేర్కొన్నారు. ఇక డీజిల్ ఇంజన్ మాత్రం.. 115 PS శక్తి, 250 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

4 /7

  క్లావిస్ SUV అనేక ఫీచర్స్‌తో అందుబాటులో రాబోతోంది. వీటిలో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, పానోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి అనేక ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది.

5 /7

క్లావిస్ SUV సేఫ్టీ విషయానికొస్తే, ఇది ఆరు ఎయిర్‌బ్యాగులతో పాటు ABS తో EBD, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఇందులో హిల్ స్టార్ట్ అసిస్ట్ సపోర్ట్‌ కూడా లభిస్తుంది.  

6 /7

క్లావిస్ SUV కారను లోపలి భాగం చాలా విశాలంగా ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఐదుగురు ప్రయాణికులు కూడా  సౌకర్యవంతంగా ప్రయాణం చేయోచ్చు.

7 /7

క్లావిస్ SUV 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ 17 kmpl మైలేజ్‌ను ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రెండవ వేరియంట్‌ 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ 20 kmpl మైలేజ్‌ను ఇస్తుంది. దీని ధర రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంటుంది.