Kia Ev3 Car: 600 మైలేజీతో Kia Ev3 కొత్త కారు త్వరలోనే లాంచ్‌.. ఫీచర్స్‌ లీక్‌!

Kia Ev3 Car: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన ఎలక్ట్రిక్ EV3 SUV కారు మార్కెట్‌లోకి రాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో రాబోతోంది. అంతేకాకుండా ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే దాదాపు 600 వరకు మైలేజీని అందిస్తుంది. అయితే ఈ కారుకు సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ తెలుసుకోండి. 


Kia Ev3 Car: భారత మార్కెట్‌లో కియా కార్లకు రోజు రోజు డిమాండ్‌ పెరిగిపోతోంది. ప్రీమియం ఫీచర్స్‌తో మిడిల్‌ రేంజ్‌ బడ్జెట్‌లో అందుబాటులోకి రావడం వల్ల చాలా మంచి వీటినికి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే కంపెనీ దీనిని దృష్టిలో పెట్టుకుని ఎంట్రీ-లెవల్ ఆల్-ఎలక్ట్రిక్ EV3 SUVని మార్కెట్‌లోకి విడుదల చేసింది. అయితే ఈ కారుకు సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేసన్స్‌ ఇప్పుడు తెలుసుకుందాం. 

1 /6

ఈ Kia EV3 ఎలక్ట్రిక్‌ కారు  కేవలం 31 నిమిషాల్లో 10 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. దీంతో పాటు  7.5 సెకన్లలో 0 నుంచి 100కిమీ/గం వరకు గరిష్ట వేగాన్ని చేరుకుంటుంది. అలాగే ఇది అద్భుతమైన బ్యాటరీతో అందుబాటులోకి రానుంది.  

2 /6

  ఈ కియా ఎలక్ట్రిక్ EV3 SUV కారు ఇటీవలే లాంచ్‌ అయిన EV9 డిజైన్‌ కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది 5-సీటర్‌ కెపాసిటీతో అందుబాటులోకి వచ్చింది. ఇది అద్భుతమైన లీడింగ్ క్యాబిన్ స్పేస్ కలిగి ఉంటుంది.   

3 /6

అలాగే ఈ కారును ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే దాదాపు 600కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది. అలాగే ఈ కారు 7.5 సెకన్లలో 0 నుంచి 100కిమీ/గం గరిష్ట వేగాన్ని కలిని ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఈ కారు ఆరు కలర్‌ ఆప్షన్స్‌లో రాబోతోంది.  

4 /6

ఇక Kia EV3 స్మార్ట్‌ కారు ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే, ఇది క్యూబికల్ ఆకారపు LED హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఈ కారు  వైట్ ఇన్‌సర్ట్‌లతో బ్లాక్డ్-అవుట్ అల్లాయ్ సెటప్‌తో అందుబాటులోకి రానుంది.  

5 /6

ఈ కారు ప్రీమియం L-ఆకారపు LED DRLలను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఇందులో  రివర్స్ పార్కింగ్ కెమెరాలను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్‌తో రాబోతోంది.   

6 /6

ఇక ఈ Kia EV3 కారుకు సంబంధించిన ఇంటీరియర్ విషయానికొస్తే, ఇది క్యాబిన్ ఆఫ్-సెట్ Kia లోగోను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఈ కారు మూడు-స్పోక్ స్టీరింగ్ వీల్స్‌తో రాబోతోంది. ఇది 460 లీటర్ల బూట్ స్పేస్‌తో పాటు అద్భుతమైన లేదర్‌ ఫినిషింగ్‌తో రాబోతోంది.