Honor Magic 6 Pro: 108MP కెమెరాతో శక్తివంతమైన Honor Magic 6 Pro వచ్చేస్తోంది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ లీక్!

Honor Magic 6 Pro: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ హానర్‌ నుంచి మార్కెట్‌లోకి Magic 6 Pro స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి. 

 

Honor Magic 6 Pro Price: భారత మార్కెట్‌లో త్వరలోనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతోంది. ఇది ప్రముఖ మొబైల్‌ కంపెనీ హానర్ నుంచి విడుదల కాబోతోంది. గతంలో లాంచ్‌ చేసిన Magic సిరీస్‌కి మంచి గుర్తింపు లభించడంతో HONOR కంపెనీ త్వరలోనే త్వరలోనే Magic 6 Pro లాంచ్‌ చేయబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. 
 

1 /6

హానర్‌ Magic 6 Pro స్మార్ట్‌ఫోన్ లాంచ్‌ కాకముందే ఈ మొబైల్‌ సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ సోషల్‌ మీడియాలో లీక్‌ అయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ Vivo ఇటీవలే లాంచ్‌ చేసిన శక్తివంతమైన మొబైల్‌ కన్నా ఎక్కువ ఫీచర్స్‌తో వస్తోంది.  

2 /6

లీక్‌ అయిన వివరాల ప్రకారం.. ఈ Magic 6 Pro స్మార్ట్‌ఫోన్‌ హై ఎండ్‌ మోడల్‌ సుమారు ధర రూ. 2,42,65 ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు 16 GB ర్యామ్‌, 512 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్  ధర సుమారు రూ. 72,400 ఉండే అవకాశాలు ఉన్నాయి.    

3 /6

హానర్ మ్యాజిక్ 6 ప్రో ఫీచర్ల వివరాల్లోకి వెళితే, ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.8 అంగుళాల OLED డిస్ప్లేతో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఇది 2800 x 1264 పిక్సెల్స్‌తో రాబోతోంది.

4 /6

ఈ హానర్ మ్యాజిక్ 6 ప్రో స్మార్ట్‌ఫోన్‌ చిప్‌సెటప్‌ వివరాల్లోకి చూస్తే, ఇది Qualcomm Snapdragon 8 Gen 3 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఈ మొబైల్‌ Adreno 750 జీపీయూతో అందుబాటులోకి రానుంది. 

5 /6

ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ కెమెరా వివరాల్లోకి వెళితే, బ్యాక్ సెటప్‌లో 50MP ప్రధాన కెమెరాతో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా అదనంగా 50MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 180MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాలను కలిగి ఉంటుంది.  

6 /6

ఈ హానర్ మ్యాజిక్ 6 ప్రో స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా మ్యాజిక్ OS 8.0పై రన్‌ అవుతుంది. అంతేకాకుండా 50MP ఫ్రంట్ కెమెరా,  5,600mAh బ్యాటరీ, 80W వైర్డు ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తోంది.