Kitchen Hacks: శ్రావణ మాసంలో కొట్టిన కొబ్బరి కాయలు మిగిలిపోయాయా.. ఇలా వాడి చూడండి

Kitchen Tips:  శ్రావణమాసం వచ్చిందంటే చాలు పలు రకాల పూజలు నోములు వ్రతాలతో ఇంట్లో కొబ్బరి చిప్పలు మిగిలిపోతూ ఉంటాయి. వీటిని ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే కొబ్బరి చిప్పలతో ఏం చేయవచ్చో తెలుసుకుందాం.

1 /9

Kitchen Tips:  శ్రావణమాసం వచ్చిందంటే చాలు పలు రకాల పూజలు నోములు వ్రతాలతో ఇంట్లో కొబ్బరి చిప్పలు మిగిలిపోతూ ఉంటాయి. వీటిని ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే కొబ్బరి చిప్పలతో ఏం చేయవచ్చో తెలుసుకుందాం.  

2 /9

కొబ్బరి చిప్పలను అలాగే వదిలి వేస్తే పాడైపోయే ప్రమాదం ఉంది. అందుకే కొబ్బరి చిప్పలను ఎండలో పెట్టి ఎండపెట్టినట్లయితే అవి ఎండు కొబ్బరిగా మారిపోతుంది. వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి స్టోర్ చేసుకున్నట్లయితే.. మసాలా కూరల్లో పొడి చేసి వాడుకోవచ్చు.

3 /9

కొబ్బరి చిప్పల్లోని కొబ్బరిని తురిమి ఎండబెట్టి పొడిగా  చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఎండు కొబ్బరి పొడిని వివిధ కూరల్లో వాడుకోవచ్చు.  

4 /9

కొబ్బరి చిప్పల్లోని కొబ్బరిని ఎండిన అనంతరం.. నూనె మిల్లులో ఇచ్చి కొబ్బరి నూనె తయారు చేయించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీకు ఫ్రెష్ నూనె లభ్యం అవుతుంది.  

5 /9

పచ్చి కొబ్బరి చిప్పలు మిగిలిపోయినట్లయితే..అందులోని కొబ్బరి నీ తురిమి బెల్లం కలిపి స్వీట్ తయారు చేసుకోవచ్చు . ఇది పిల్లలకు ఎంతో మంచిది.  

6 /9

కొబ్బరి ముక్కలు మిగిలిపోయినట్లయితే వాటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసి కొబ్బరి పాలను సేకరించవచ్చు. ఈ కొబ్బరిపాలతో వివిధ రకాల కూరల్లో వేసి రుచికరంగా చేయవచ్చు.  

7 /9

కొబ్బరి చిప్పలను ఎండలో ఆరబెట్టి వాటి నుంచి ఎండుకొబ్బరి తీసి దాన్ని పొడి రూపంలో చేసిన అనంతరం అందులో ఉప్పు కారం వేసి కొద్దిగా నువ్వులు కలిపి కొబ్బరి పొడిని తయారు చేసుకోవచ్చు. దీన్ని అన్నం లోను ఇడ్లీలోను నంచుకొని తినవచ్చు.

8 /9

పచ్చి కొబ్బరి తురుమును ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో వేసి ఫ్రిజ్లో దాచి పెట్టుకోవచ్చు. దీన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు తీసి కూరలో వాడుకోవచ్చు.  

9 /9

పచ్చి కొబ్బరికాయలు తురిమి ఇందులో రవ్వ కలిపి పంచదార వేసి నెయ్యితో రవ్వ లడ్డు కూడా తయారు చేసుకొని తినవచ్చు.