Klinkara Photo Viral: రామ్ చరణ్, ఉపాసనలో గారాల పట్టి క్లీంకారా చూస్తూ ఉండగానే పెద్దదైపోయింది. క్లీంకారా ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చూస్తూ ఉండగానే ఇంతలా పెరిగిపోయిందా? అని నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు. క్లీంకారా తాత చేతిలో దేవుడు సన్నిధిలో ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
హీరో రామ్ చరణ్, ఉపాసన కూతురు క్లీంకారా ఫోటోలు ఎప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారుతాయి. తన అభిమాన హీరో కూతురు ఎలా ఉందో చూడాలని ఉత్సాహంగా ఉంటారు.
అలాంటి వారిని ఖుషీ చేసేందుకు ఉపాసన అప్పుడప్పుడు క్లీంకారాకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ముఖం సరిగ్గా కనిపించి, కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుని ఫోటోలను షేర్ చేస్తుంది ఉపాసన.
ప్రస్తుతం క్లీంకారాకు సంబంధించిన మరో ఫోటో కూడా వైరల్ గా మారింది. రామ్ చరణ్ వైఫ్ ఉపాసన కొణిదెలా తన ఇంస్టాగ్రామ్, ఎక్స్ పేజీలో క్లీంకారాకు సంబంధించిన ఫోటోను షేర్ చేసింది.
ఈ ఫోటోలో క్లీంకారాను తన తాత ఎత్తుకోగా పక్కనే అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాప్ సి రెడ్డి జంట కూడా ఉంది. ఈ ఫోటోను షేర్ చేస్తూ ఉపాసన ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వేధికగా ఇలా రాసుకోచ్చింది.
'క్లీంకారా మాకు దేవుడిచ్చిన వరం. మా హాస్పిటల్ లో జరిగిన వెంకటేశ్వర స్వామి వారి పవిత్రోత్సవం ఈరోజు జరిగింది. క్లింకారాను తన తాత ఎత్తుకున్నారు ఈ ఫోటో చూస్తే నాకు నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి.
ఈ హాస్పిటల్లోని ఎప్పటికీ నేను మర్చిపోను. నాకు ఎంతో ప్రత్యేకం, మర్చిపోలేని క్షణం ఓం నమో వెంకటేశాయ అని రాసుకు వచ్చింది.
ఇక చిరంజీవి తనయుడు రామ్ చరణ్, ఉపాసన కామినేని 2012లో వివాహం చేసుకున్నారు. వీరిది ప్రేమ వివాహం. వీరికి ఒక కూతురు క్లీంకారా.