Mini Switzerland: మీలో చాలామందికి స్విట్జర్లాండ్ వెళ్లాలనే కోరిక ఉండి ఉంటుంది కదా. అయితే మన దేశంలోనే అంటే ఇండియాలోనే మినీ స్విట్జర్లాండ్ ఒకటుందని తెలుసా మీకు. అంతేకాదు దేశంలో పింక్‌సిటీగా ప్రసిద్ధి కెక్కిన జైపూర్‌కు ఓ విభిన్నమైన ప్రత్యేకత ఉంది. అటు మసూరీ కొండప్రాంతం చాలా విశిష్టమైనది. విదేశాల్లో ఉన్న అనుభూతి కావాలంటే హిమాచల్‌ప్రదేశ్ ఉంది. దీనికోసం ఖజ్జార్ ప్రాంతాన్ని సందర్శిస్తే చాలు. ఇక్కడి అందాలు చూస్తుంటే..చూస్తుండి పోతారిక
హిమాచల్‌ప్రదేశ్‌లోని ఖజ్జార్‌ను ఇండియాలోని బెస్ట్ హానీమూన్ డెస్టినేషన్‌గా పిలుస్తారు. ఈ ప్రాంతాన్ని మినీ స్విట్జర్లాండ్ అని అంటారు.
ఖజ్జార్ చంబా, డల్హౌసీ మధ్య కేవలం అరగంట జర్నీ ఉంటుంది. ఇక్కడికి స్వదేశీ టూరిస్టులు భారీ సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడికి చేరుకోవాలంటే షిమ్లా వరకూ ట్రైన్ లేదా ఫ్లైట్‌లో రావల్సి ఉంటుంది. అక్కడ్నించి ట్యాక్సీ ద్వారా చేరుకోవచ్చు.
దేవదారు చెట్లు, సరస్సులో నీలంగా కన్పించే నీరు, అత్యంత అందంగా ఉంటాయి. ఇక్కడ వాతావరణం ఎప్పుడూ చల్లగానే ఉంటుంది.
మీకు కూడా విదేశాలకు వెళ్లాలని ఉంటే..హిమాచల్‌ప్రదేశ్‌లోని ఖజ్జార్ ప్రాంతాల్ని సందర్శించండి చాలు. ఇక్కడి అందాలు చూస్తుంటే తనివి తీరదు.
ఖజ్జార్ లోయలు..అందాలు సుదూర ప్రాంతాల్నించి పర్యాటకుల్ని ఆకర్షిస్తుంటాయి. ప్రపంచంలోని టాప్ 160 మినీ స్విట్జర్లాండ్‌లలో ఒకటి ఖజ్జార్ ప్రాంతం
ఇండియాలో తక్కువ బడ్దెట్‌లో హిల్‌స్టేషన్ లేదా హానీమూన్ ట్రిప్ వంటి డెస్టినేషన్ల గురించి తెలుసుకునేటప్పుడు ఊటీ గురించి వినే ఉంటారు. కానీ హిమాచల్‌ప్రదేశ్‌లోని ఖజ్జార్ ప్రాంతం కూడా ఒకటుంది.