Dhanush Second Marriage: 40 ఏళ్ల వయసులో ధనుష్ రెండో పెళ్లి.. వెలుగులోకి సంచలన విషయం.. ఎవరిని చేసుకోవాలో క్లారిటీ..!

Actor Dhanush Second Marriage: కోలీవుడ్ స్టార్ యాక్టర్ ధనుష్ రెండో పెళ్లిపై నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 40 ఏళ్ల వయసులో ధనుష్ మరో వివాహం చేసుకునేందుకు రెడీ అయ్యారని రూమర్లు వస్తున్నాయి. ఈ పెళ్లికి ధనుష్ ఒప్పుకున్నారా..? వధువు ఎవరు అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
 

  • May 26, 2024, 14:18 PM IST
1 /7

ధనుష్ నవంబర్ 2004లో సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నారు. పెళ్లి నాటికి ధనుష్ వయస్సు 21 ఏళ్లు కాగా.. ఐశ్వర్య వయస్సు 22 సంవత్సరాలు.   

2 /7

వీరిద్దరికి ఇద్దరు కుమారులు. సజావుగా సాగుతున్న వీరి వైవాహిక జీవితం కొన్నాళ్ల క్రితం మలుపు తీసుకుంది.   

3 /7

ఇద్దరు పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు జనవరి 2022లో తమ సోషల్ మీడియా పేజీలలో ప్రకటించారు.  

4 /7

ఈ వార్తలో అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆ తరువాత ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు.  

5 /7

18 ఏళ్ల వైవాహిక జీవితం తరువాత ఇద్దరు గుడ్ బై చెప్పుకున్నారు. ధనుష్ సినిమాలతో బిజీ కాగా.. ఐశ్వర్య రజనీకాంత్ కూడా తన సినిమాలో నిమగ్నమైపోయారు.   

6 /7

ఈ క్రమంలో ధనుష్ రెండో పెళ్లి వార్త తెరపైకి వస్తోంది. ధనుష్‌ను రెండో పెళ్లికి ఒప్పించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.  

7 /7

తాజాగా ఓ ప్రముఖ జర్నలిస్టు తన ఇంటర్వ్యూలో సంచలన విషయాన్ని వెల్లడించారు. వధువు సినీ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి కాదని.. బంధువుల్లో అమ్మాయిని చూస్తున్నారని అంటున్నారు. సినీ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి అయితే మళ్లీ ఇబ్బందులు తప్పవని.. అందుకే దగ్గరి వాళ్లను చూస్తున్నారని చెబుతున్నారు. ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.  

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x