Sugar To Kids: చిన్న పిల్లలకు షుగర్ తినిపిస్తున్నారా..? షాకింగ్ విషయాలు వెల్లడించిన డాక్టర్లు..

Sugar Effect: చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు అన్నంలో చక్కెర కలిపి పెడుతుంటారు. పిల్లలు ఫుడ్ తీసుకొనని మారాంచేస్తుంటే.. అన్నంలో, ఇతర పదార్థాలలో షుగర్ పెట్టి తినిపిస్తారు. కానీ ఇలా అస్సలు చేయోద్దని నిపుణులు చెబుతున్నారు. దీనితో దీర్ఘకాలికమైన సమస్యలు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు.
 

1 /6

మనలో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు తినకుండా తెగ కంగారు పడుతుంటారు. చిన్న పిల్లలు అన్నం తినడం విషయంలో మారాంచేయడం కామన్. కానీ తల్లిదండ్రులు ప్రతిదానికి ఇబ్బందులు పడకుండా ఉండాలి. చిన్న పిల్లలకు హెల్తీఫుడ్ లను కొంచెం కొంచెంగా తిన్పించం కోసం ప్రయత్నించాలి. 

2 /6

కొన్నిసార్లు ఫ్రూట్స్ ను చిన్నచిన్న ముక్కలుగా చేసి తిన్పించాలి. అంతే కాకుండా అన్నంను మెత్తగా చేసి, సులువుగా పిల్లలకు జీర్ణమయ్యేలా చూసుకొవాలి. అంతేకాకుండా.. పిల్లలకు కొంచెం కొంచెంగా ఎక్కువ పదార్థాలను తిన్పించడం కోసం ప్రయత్నిస్తుండాలి. ఒకేసారి తిన్పించడం కోసం పిల్లలను ఇబ్బందులు పెట్టకూడదు.

3 /6

కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలు అన్నం పెట్టడానికి, చక్కెర కల్పి ఇస్తుంటారు. చక్కెరను వారి నాలుకకు పెట్టి ఆ తర్వాత అన్నం పెడుతుంటారు. కానీ దీని వల్ల పిల్లలకు అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

4 /6

ముఖ్యంగా పిల్లలకు రెండేళ్లలోపు ఉన్న వారికి చక్కెర ఫుడ్ ప్రాడక్ట్ ను తినిపిస్తే అగ్రేస్సివ్ గా తయారవుతారంట. దీంతో వారిలోనే చిన్న ఏజ్ లోనే డయాబెటిక్ సమస్య వచ్చే అవకాశం కూడా లేకపోలేదని వైద్యులు చెబుతున్నారు. అదే విధంగా చిన్న పిల్లలో  జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఏర్పడే అవకాశం ఉందనిచెబుతున్నారు.  

5 /6

పిల్లల చిగుళ్లు, పళ్లు కూడా చక్కెరను అధికంగా తినడం వల్ల.. తొందరగా ప్రభావానికి గురిఅవుతాయంట. పిల్లలు పూర్తిగా చక్కెరకు అడిక్ట్ అయిపోతారు. పొరపాటున చక్కెర లేకుండా ఫడ్ నుఅస్సలు తినరు. ఇలాంటి అలవాట్ల వల్ల చిన్న పిల్లల ఆరోగ్యాన్ని తల్లిదండ్రులు చేజేతులా పాడు చేసిన వారవుతారంటూ ముంబైకి చెందిన డయాబెటిక్ డాక్టర్ కోవిల్ వెల్లడించారు.

6 /6

చక్కెర ప్రభావంతో పిల్లలు కోపంగా ఉండటంతోపాటు, ఆహారం కూడా తినడం మానేస్తుంటారని, మరికొన్ని సందర్బాలలో తీవ్రమైన కడుపునొప్పికి సమస్యకు గురిఅయ్యే అవకాశం కూడా లేకపోలేదంటూ కూడా వైద్యులు చెబుతున్నారు. అందుకే చిన్న పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా చక్కెరను తిన్పించకూడదని డాక్టర్లు సూచిస్తున్నారు.