LPG Cylinder Cashback Offer: గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే రూ.500 క్యాష్ బ్యాక్!

  • Dec 01, 2020, 09:53 AM IST

వంటగ్యాస్ మనకు కచ్చితంగా అవసరమయ్యే ఓ వస్తువు. నిత్యావసర సరుకుగా ఉండే ఎల్పీజీ సిలిండర్ (LPG Cylinder) ధరలు సామాన్యులను ప్రతిక్షణం కలవరపెడుతుంటాయి. అయితే కొన్ని టెక్సిక్స్ వాడితే కొన్ని సందర్భాలలో LPG సిలిండర్లపై సైతం క్యాష్ బ్యాష్ అందుకోవచ్చు. కస్టమర్లను ఆకర్షించేందుకు పలు కంపెనీలు సీజనల్ క్యాష్ బ్యాక్ అందిస్తుంటాయి. 

1 /5

2 /5

తాజాగా పేటీఎం యాప్ (Paytm APP) ద్వారా వంటగ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే రూ.500 వరకు క్యాష్ బ్యాక్ అందుకునే అవకాశం వచ్చింది. అయితే మొదటిసారి పేటీఎం యాప్ ద్వారా సిలిండర్ బుక్ చేసే వారికి ఈ క్యాష్ బ్యాక్ సౌకర్యం కల్పించారు. మీ ఫోన్‌లో పేటీఎం ఉందా.. మీరు ఇప్పటివరకూ దీని నుంచి ఎల్పీజీ సిలిండర్ బుక్ చేయలేదా.. అయితే ఇంకెందుకు ఆలస్యం.

3 /5

ముందుగా పేటీఎం యాప్ (Paytm App) ఓపెన్ చేయండి. వివరాలు టైప్ చేసి లాగిన్ అవ్వాలి. మీ హోమ్ స్క్రీన్ కాస్త కిందకి స్క్రోల్ చేస్తే బుక్ సిలిండర్ (Book Cylinder) ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు కావలసిన గ్యాస్ కంపెనీ పేరు బుక్ చేసుకోవాలని సూచిస్తుంది.

4 /5

ఇండేన్ గ్యాస్, భారత్ గ్యాస్, HP గ్యాస్ లలో ఏదైనా ఒకటి ఎంచుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ మొబైల్ నెంబర్ లేదా ఎల్‌పీజీ ఐడీని ఎంటర్ చేయాలి. ఆ తరువాత మనకు కస్టమర్ పేరు, వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తుంది. సిలిండర్ బుకింగ్‌కు ఎంత చెల్లించాలో చూపిస్తుంది. Also Read : Lower Interest Rates On Home Loans: హోమ్ లోన్ తీసుకునే వారికి శుభవార్త.. అతి తక్కువ వడ్డీకే రుణాలు

5 /5

అక్కడ ప్రాసెస్ వివరాలు చూశాక డబ్బు చెల్లించే సమయంలో ప్రోమో కోడ్ FIRSTLPGని ఎంటర్ చేయాలి. తద్వారా తొలిసారి పేటీఎం ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసేవారికి రూ.500 క్యాష్ బ్యాక్ ఆఫర్ లభిస్తుంది. Also Read : SBI Recruitment 2020: భారీగా ఉద్యోగాలకు SBI నోటిఫికేషన్, పూర్తి వివరాలు