Chenchalamma Photos: మగువా ఓ మగువా సీరియల్‌ చెంచలమ్మ.. రియల్‌ లైఫ్‌లో ఎలా ఉంటారో తెలుసా? పిక్స్‌ వైరల్‌ ..

Chenchalamma Real Life Photos Viral: మాటీవీలో ప్రసారమవుతున్న మగువా ఓ మగువా సీరియల్‌కు ఆధరణ బాగా పెరిగింది. దీనికి అసలు కారణం అందులో ఓ పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌. ఆ సీరియల్‌కు ఓ విధంగా ఆయువు అనే చెప్పాలి. ఆ క్యారెక్టర్‌ పేరే చెంచలమ్మ. ఈమె పేరు చెబితేనే ఓ వైబ్రేషన్‌. అయితే, చెంచలమ్మ రియల్‌ లైఫ్‌లో ఎలా ఉంటారో తెలుసా?
 

1 /6

చెంచలమ్మ అసలు పేరు నేత్ర జాదవ్‌. ఈమె కన్నడ యాక్ట్రెస్‌. ఈమె కన్నడలో ఆరుకు పైగా సీరియల్స్‌లో నటించారు. ఈటీవీలో ప్రసారమైన లక్ష్యం, రావోయి చందమమ్మ అనే సీరియల్‌లో ఇంద్రసేనగా నటించి మెప్పించారు. ఈ సీరియల్‌ నుంచి తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు నేత్రకు వచ్చింది.  

2 /6

ఆ తర్వాత మాటీవీలో ప్రసారమవుతున్న మగువా ఓ మగువాలో చెంచలమ్మ అనే పవర్‌ఫుల్ క్యారక్టర్‌ దక్కించుకున్నారు. ఈ సీరియల్‌లో నటిస్తున్న నేత్ర ఇందులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సీరియల్‌ మొదటి వారంలోనే మంచి టీఆర్‌పీని సొంతం చేసుకుంది..  

3 /6

మగువా ఓ మగువా అత్తకోడళ్ల మధ్య సాగుతున్న కథ. ఇందులో తెలుగు యాక్టర్‌ శ్రవణ్‌ హీరోగా నటిస్తున్నారు. హిరోయిన్‌గా కృతికా ఉమా శేఖర్ అనే కొత్త అమ్మాయిని తీసుకున్నారు.  

4 /6

ఇక ఈ సీరియల్‌లో అత్త క్యారక్టర్‌లో చెంచలమ్మగా నేత్ర పవర్‌ఫుల్‌ రోల్‌లో నటిస్తున్నారు. ఈమె ఆ క్యారక్టర్‌లో అద్భుతంగా నటిస్తున్నారు. తెలుగులో నేత్రకు ఇది మూడో సీరియల్‌. కన్నడ సీరియల్స్‌లోనే కాదు పలు సినిమాల్లో కూడా నటించారు.  

5 /6

అయితే, రియల్‌ లైఫ్‌లో చెంచలమ్మ ఎలా ఉంటారో చూస్తే షాకవుతారు. ఆమె మోడ్రన్‌ లుక్‌లో కనిపిస్తారు. అసలు చెంచలమ్మనే ఈమె అని ముక్కున వేలేసుకుంటారు కూడా. చెంచలమ్మ రియల్‌ లైఫ్‌కు సంబంధించిన కొన్ని చిత్రాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.  

6 /6

మగువా ఓ మగువా సీరియల్‌ తెలుగు ప్రేక్షకులు తెగ ఆదరిస్తున్నారు. దీనికి చాలా పవర్‌ ఫుల్‌ క్యారెక్టర్‌లో చెంచలమ్మగా నేత్రా జాదవ్‌, ఇక హీరో అమాయకపు క్యారక్టర్‌, కోడలు పెళ్లి చేయాలని ఆమె చేసే తాపత్రయం వెరసి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ పొందుతోంది.