Mahindra Bolero: దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా వినియోగించే వాహనాల్లో ముఖ్యమైంది మహీంద్రా బొలేరో. అటు లుక్ ఇటు సామర్ధ్యం రెండింట్లోనూ మహీంద్రా బొలేరోకు తిరుగులేదు. ఈ అద్భుతమైన ఎస్యూవీ గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బొలేరో వాహనం చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. రోడ్లు బాగాలేకున్నా రాళ్లు రప్పల రోడ్సలపై కూడా చాలా సులభంగా వెళ్లగలదు. రోడ్లు బాగాలేకపోయినా తేడా ఉండదు.
బొలేరో మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ. అంటే రన్నింగ్‌లో పెద్దగా ఖర్చుండదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారికి మంచి ప్రత్యామ్నాయం
బొలేరో అనేది ఇంధనం పొదుపు కూడా చేస్తుంది. సుదూర ప్రయాణాలకు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తక్కువగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లో బొలేరో అనువుగా ఉంటుంది.
బొలేరోలో సామాను రవాణా చేసేందుకు స్పేస్ బాగుంటుంది. ఇది రైతులు, చిన్న చిన్న వ్యాపారులకు ఉపయోగంగా ఉంటుంది.
మహీంద్రా బొలేరో అనేది క్రెడిబిలిటీకు పెట్టింది పేరు. ఏళ్ల తరబడి మన్నిక ఉంటుంది. గ్రామీణ ప్రజలు ఎక్కువగా బొలేరో వాహనం కొనుగోలు చేస్తుంటారు