Matka Review: ప్రస్తుత హీరోలు సినిమా కథల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు.. తీసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రేక్షకులలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. కథ, కథనం కొత్తగా ఉంటే తప్ప.. కేవలం ఈ రోజును పాటలను.. చూసి థియేటర్స్ కు వెళ్లే రోజులు పోయాయి. ప్రస్తుతం డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫార్మ్స్ కాదు కావలసినన్ని ఉండడంతో.. సినిమా కొంచెం బాగా లేకపోయినా ఎంచక్కా కొద్ది రోజుల తర్వాత ఇంట్లోనే చూసేద్దాంలే అనుకుంటున్నారు. ఇలాంటి క్రమంలో మెగా హీరో వరుణ్ తేజ్ తీసుకుంటున్న నిర్ణయాలు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.
మెగా హీరో వరుణ్ తేజ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ముకుంద సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు ఈ హీరో. మొదటి చిత్రంతోనే మెగా ప్రిన్స్ అనే పేరు..తెచ్చి పెట్టుకున్నారు. ఇక ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె సినిమా.. వరుణ్ పైన తెలుగుపేక్షకులకు ఎంతో గౌరవం తెచ్చిపెట్టింది. ఈ హీరో ఇలాంటి కథలను ఎంచుకుంటూ పోతే ఈయనకి తిరుగు ఉండదు అనుకున్నారు అందరూ.
ఆ తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమా వరుణ్ కి మరో బ్లాక్ బస్టర్.. అందించింది. ఈ సినిమా వల్ల వచ్చిన క్రేజ్ మొత్తం సాయి పల్లవికి వెళ్ళినా కానీ.. వరుణ్ తేజ్ కథల ఎంపిక పైన మాత్రం ప్రేక్షకులకు మరింత గౌరవం కలిగింది. అందుకు తగ్గట్టుగానే ఆ తర్వాత వచ్చిన ఎఫ్2 చిత్రం కూడా మంచి విజయం అందించింది. ఇక వీటి మధ్యలో వచ్చిన తొలిప్రేమ సినిమా కూడా.. వరుణ్ కెరియర్ లో మంచి చిత్రంగా మిగిలింది. ఇక్కడ వరకు బాగానే ఉన్న.. అసలు కథ ఆ తరువాత మొదలయ్యింది.
వరస పెట్టి డిజాస్టర్లు ఇవ్వడం మొదలుపెట్టారు ఈ మెగా హీరో. అప్పటివరకు.. కథల పరంగా వరుణ్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు అనుకున్న వారి కంటే షాప్ పైన షాక్.. ఎదురవ్వడం మొదలయ్యాయి. అసలు వరుణ్ ఎంచుకుంటున్న కథలు ఏమిటి.. ఈయన కొంచమన్నా ఆలోచిస్తున్నారా అనే పరిస్థితికి ఆయన అభిమానులను తీసుకొచ్చారు ఈ మెగా హీరో.
ముఖ్యంగా ఈ మధ్య వరుణ్ ఎంచుకున్న కథలు వీటికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ముందుగా గనీ సినిమాలో.. కథ పైన కాదు కదా అతని లుక్స్ పైన కూడా వరుణ్ కాన్సన్ట్రేట్ చేయలేదేమో మీ అందరూ విమర్శలు చేసాగారు. గని చిత్రం అప్పట్లో..వరుణ్ కెరియర్ లోనే అత్యంత పెద్దది డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత ఎన్నో అంచనాలతో వచ్చిన ఎఫ్3 కూడా ఫ్లాప్ అయ్యింది.
కాగా గని కన్నా పెద్ద దిజాస్టర్ వరుణ్ ఎదుర్కోరేమో అనుకుంటున్న సమయంలో.. గాంధీవదారి అర్జున్ చిత్రం వచ్చి.. తెలుగు ఇండస్ట్రీ డిజాస్టర్స్ లోనే ఒక గొప్ప దడిజాస్టర్ గా పేరు తెచ్చుకుంది. ఇక అక్కడితో కూడా కథ ముగియలేదు.. కనీసం సినిమా విడుదల కాకముందే.. వరుణ్ ఆపరేషన్ వాలెంటైన్ సినిమా డిజాస్టర్ అవుతుంది అని ప్రేక్షకులు చెప్పేశారు. ఎందుకంటే ఆ చిత్రం ట్రైలర్.. చిన్న స్క్రీన్ పైన చూస్తేనే బోర్ కొట్టొచ్చింది. ఇక ఈ సినిమాని పెద్ద స్క్రీన్ పైన ఏమి చూస్తామని ముందుగానే ఫిక్స్ అయిపోయారు ప్రేక్షకులు. అందుకు తగ్గట్టుగానే ఆ సినిమా మరో భారీ డిజాస్టర్ అందుకుంది. ఇలాంటి ఘోరమైన ఫ్లాపుల తర్వాత.. మెగా అభిమానులు తమ మెగా ప్రిన్స్ పైన ఉన్న ఆశలన్నీ మట్కా చిత్రం పైన పెట్టుకున్నారు. ఈరోజు విడుదలైన ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అంతేకాకుండా వరుణ్ కెరియర్ లోనే ఈ సినిమా అత్యంత ఎక్కువ బడ్జెట్ తో వచ్చింది.
అయితే ఈ సినిమా ఫలితం మాత్రం మరోసారి వరుణ్ నిర్మాతలకు కష్టాలు తెచ్చి పెట్టక.. మానేటట్లు లేదు. ఈ చిత్రం మొదటి షో నుంచి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటుంది. ఈ క్రమంలో అసలు ఈ మెగా హీరోకి ఏమయ్యింది.. ఇకనైనా కథల ఎంపికలో ఈ హీరో మారకపోతే.. ఇక ఈయన కెరియర్ ఇంతే అని కామెంట్లు చేస్తున్నారు అందరూ.