Mercury Retrograde: రివర్స్‌లో బుధుడి కదలిక.. ఈ రాశుల వారికి అనుకోని ధన లాభాలు..

Mercury Retrograde: ప్రతినెల బుధ గ్రహం ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తూ ఉంటుంది.  అందుకే జ్యోతిష్య శాస్త్రంలో ఈ గ్రహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహాన్ని అన్ని గ్రహాలకు రాకుమారుడుగా కూడా పిలుస్తారు. ఇదిలా ఉంటే ఈ బుధ గ్రహం ఆగస్టు 4వ తేదీన సూర్యుడు అధిపతిగా భావించే సింహరాశిలోకి తిరోగమనం చేశాడు. 

1 /9

బుధుడి తిరోగమన కదలికల కారణంగా అన్ని రాశుల వారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది.. అయితే ఈ తిరోగమన కొన్ని రాశుల వారికి కలిసి వస్తే మరికొన్ని రాశుల వారికి మాత్రం తీవ్ర దుష్ప్రభావాలను కలిగిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

2 /9

సూర్యుడు పాలించే సింహరాశిలోకి బుధుడు ఆగస్టు 4వ తేదీన తిరోగమనం చేశాడు. ఆ తర్వాత ఈ గ్రహం సింహ రాశి నుంచి చంద్రుడు పాలించి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తుంది. 

3 /9

బుధుడు తిరోగమనం చేయడం కారణంగా ప్రత్యక్ష ప్రభావం పడి ఏయే రాశుల వారు ఎలాంటి లాభాలు పొందుతారో? ఎక్కువగా లాభాలు పొందబోయే రాశుల వారెవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

4 /9

బుధుడు తిరోగమనం చేయడం కారణంగా ధనస్సు రాశి వారికి భారీ ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా కొత్త ఆదాయ వనరులు కూడా పుట్టుకు వస్తాయి. 

5 /9

అలాగే ధనస్సు రాశి వారికి ప్రేమ జీవితం లో వస్తున్న సమస్యలు తొలగిపోయి. మధురమైన శృంగార భరితమైన జీవితం ప్రారంభమవుతుంది. అలాగే కెరీర్ కు సంబంధించిన విషయాల్లో కూడా అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

6 /9

బుధుడి తిరోగమనం సింహ రాశి వారికి కూడా ఎంతో బాగుంటుంది. ముఖ్యంగా వీరికి వ్యాపారాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల ఆశించిన లాభాలు కూడా పొందగలుగుతారు.

7 /9

సింహ రాశి వారి ఆర్థిక పరిస్థితులు ఈ సమయంలో చాలా వరకు నిలకడగా ఉంటాయి. దీంతోపాటు కొత్త కంపెనీల నుంచి జాబ్ ఆఫర్స్ కూడా లభిస్తాయి. అలాగే కుటుంబ జీవితం కూడా చాలా ప్రశాంతంగా సాగుతుంది.  

8 /9

ఈ తిరోగమన కారణంగా కర్కాటక రాశి వారికి కూడా ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి జీవితంలో వస్తున్న సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా పిల్లలనుంచి కూడా కొన్ని శుభవార్తలు వినే ఛాన్స్ ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

9 /9

అలాగే కర్కాటక రాశి వారికి ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడి ఆదాయంలో అనేక మార్కులు వస్తాయి. దీనికి కారణంగా పెట్టుబడులు కూడా పెడతారు. అలాగే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది.