Money Plant Vastu Tips: మనీ ప్లాంట్‌కు హిందూ మతంలో విశేష ప్రాధాన్యత, మహత్యం ఉన్నాయి. ఇంట్లో ఉంటే పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుందని అంటారు. నెగెటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. వాస్తుశాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్‌కు చాలా ప్రాధాన్యత ఉంది. అయితే ఆ మొక్కను ఇంట్లో ఏ దిశలో అమర్చుకోవాలి, ఏం చేయాలనేది తెలుసుకుందాం.
మనీ ప్లాంట్ ఎండకూడదు మనీ ప్లాంట్ ఎప్పుడూ ఎండకూడదు. ఒకవేళ ఎండితే వెంటనే తొలగించాలి. ఎండిన మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే అంతా అశుభమే
మనీ ప్లాంట్ శుక్రవారం మనీ ప్లాంట్ సంబంధం శుక్ర గ్రహంతో ఉంటుంది. అందుకే మనీ ప్లాంట్‌ను శుక్రవారం నాడు నాటాలి
మనీ ప్లాంట్ పాదు మనీ ప్లాంట్ పాదును ఎప్పుడూ పైకే పాకించాలి. నేలపై పాకించకూడదు.
మనీ ప్లాంట్ నేలలో పాతకూడదు ఇంట్లో మనీ ప్లాంట్‌ను ఎప్పుడూ నేలలో పాతకూడదు. కుండీలోనే పాతాల్సి ఉంటుంది.
ఇంట్లో మనీ ప్లాంట్ ఎక్కడ ఉండకూడదు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో మనీ ప్లాంట్‌ను పొరపాటున కూడా ఈశాన్య దిశలో అమర్చకూడదు. దీనివల్ల నష్టాలు ఎదురౌతాయి
మనీ ప్లాంట్ ఏ దిశలో ఉండాలి మనీ ప్లాంట్ సరైన దిశలో అమర్చితే ఇంట్లో ధన సంపదలు ఉంటాయి. ఇంట్లో దారిద్ర్యం , నెగెటివిటీ ఉండవు. వాస్తు ప్రకారం మనీ ప్లాంట్‌ను నైరుతి దిశలో ఉంచాలి. ఇది శుభసూచకం.
ఏ దిశలో ఉండకూడదు మనీ ప్లాంట్‌ను తప్పుడు దిశలో ఉంచితే ఇంట్లో డబ్బులు నిలవవు అంటారు. ఆ ఇంట్లో దారిద్ర్యం తాండవిస్తుందంటారు. ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం లభించదంటారు
వాస్తు శాస్త్రంలో ఇంట్లో ప్రతి వస్తువును ఏ దిశలో ఉంచాలనే సూచనలు ఉన్నాయి. అదే విధంగా మనీ ప్లాంట్ ఉంచేందుకు సరైన దిశ కూడా వాస్తులో ఉంది. మనీ ప్లాంట్‌తో ధనం ప్రాప్తిస్తుందనే నమ్మకం ఉంది. మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి కరుణ ఉంటుందంటారు