Rare Indian Birds: ప్రపంచంలో వేలాది రకాల పక్షి జాతులున్నాయి. అయితే ఇండియాలో లభించే కొన్ని పక్షులు కేవలం ఇక్కడే కన్పిస్తాయి. రంగు రంగుల రెక్కలు, అందం, ఇతర ప్రత్యేకతలకు ఈ 8 పక్షలు చాలా విశిష్టమైనవి. ఈ 8 అందమైన పక్షులు, వాటి విశిష్టతలు తెలుసుకుందాం.
గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ( గోడావన్) గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ లేదా గోడావన్ ఇది ఇండియాలో మాత్రమే కన్పించే అరుదైన పక్షి. ఇది రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో ఉంటుంది. ఎత్తైన, బలమైన శరీరం, అందమైన రెక్కలకు ప్రత్యేకం. ప్రస్తుతం వీటి సంఖ్య తగ్గిపోతోంది.
సారస్ క్రేన్ సారస్ క్రేన్ ఇండియాలోని ఎగిరే పక్షుల్లో అతి పెద్దది. ఈ పక్షి పొడవైన మెడ, రెడ్ హెడ్ కారణంగా చాలా ప్రత్యేకమైంది. ఈ పక్షలు చాలా నమ్మకమైనవి. ఉత్తర భారతదేశంలో కన్పిస్తుంది
ఇండియన్ రోలర్ ( నీలకంఠ్) నీలకంఠ్ లేదా ఇండియన్ రోలర్ పక్షి నీలం పచ్చరంగుల్లో అద్భుతంగా కన్పిస్తుంది. దసరా సమయంలో ఈ పక్షిని చూడటం శుభసూచకంగా భావిస్తారు. ఎగిరేటప్పుడు ఈ పక్షి నీలం రంగులో మెరుస్తుంటుంది.
ఇండియన్ పిట్టా ( నవరంగ్ ) ఇండియన్ పిట్టా అనేది రంగు రంగుల్లో కన్పించే అరుదైన పక్షి. ఈ పక్షి రెక్కల్లో వేర్వేరు రంగులుంటాయి. వేసవిలో ఇండియాలోని అడవుల్లో కన్పిస్తుంది. ఈ పక్షి గొంతు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
ఫ్లేమ్ థ్రోటెడ్ బుల్బుల్ ఈ పక్షి మహారాష్ట్రలో ఎక్కువగా కన్పిస్తుంది. ఆ రాష్ట్ర అధికార పక్షి ఇది. ఈ పక్షి ఛాతీ భాగంలో మెరిసే నారింజ రంగు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఎక్కువగా అడవులు, చిన్న చిన్న చెట్లలో ఉంటుంది. ఈ పక్షి గొంతు చాలా స్వీట్గా ఉంటుంది
నికోబార్ మెగాపోడ్ నికోబార్ మెగాపోడ్ కేవలం అండమాన్ నికోబార్ దీవుల్లోనే కన్పిస్తుంది. ఈ పక్షి మట్టిలో తన ఇంటిని నిర్మించుకుంటుంది. కాళ్లతో మట్టి తొలగించి గుడ్లు పెడుతుంది. ఈ 8 అరుదైన అద్భుతమైన పక్షులు కేవలం భారతదేశంలోనే కన్పిస్తాయి.
హిమాలయన్ మోనాల్ ( మోనాల్ తీతల్ ) హిమాలయన్ మోనాల్ అద్భుతమైన పక్షి. ఇది హిమాలయ ప్రాంతాల్లోనే కన్పిస్తుంది. ఈ పక్షి రెక్కల్లో నీలం, ఆకుపచ్చ, బంగారు రంగులుంటాయి. ఈ రంగులే ఈ పక్షుల్ని ఆకర్షణీయంగా మారుస్తాయి. ప్రత్యేకంగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో కన్పిస్తుంది
మలాబర్ పైరాకీట్ ( నీలి ప్యారట్) మలాబార్ పైరాకీట్ చాలా అందంగా ఉంటుంది. నీలం, ఆకుపచ్చ రంగుల్లో అద్భుతంగా కన్పిస్తుంది. ప్రధానంగా దక్షిణ భారతదేశంలోని పశ్చిమ కనుమల్లో కన్పిస్తుంది. చాలా వేగంగా ఎగురుతుంది.