Happy Mothers day 2024: మదర్స్ డే ను ఎందుకు జరుపుకుంటారు.. దీని వెనుక ఉన్న ఈ స్టోరీ మీకు తెలుసా..?

Mothers day 2024: అమ్మను దైవంతో సమానంగా చెబుతుంటారు. తొమ్మిది మాసాలు మనల్ని కడుపులో పెట్టుకుని, కంటికి రెప్పలా కాపాడుతూ జన్మనిస్తుంది. ఈ నేపథ్యంలో మదర్స్ డే ను ప్రతి ఏడాది రెండో ఆదివారం జరుపుకుంటాం. దీని వెనుక అనేక కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి.
 

  • May 11, 2024, 21:14 PM IST
1 /8

మనకు కంటికి కన్నించే దైవంగా అమ్మను చెబుతుంటారు. దేవుడు జన్మనిస్తే, తల్లి పునర్జన్మను ఇస్తుందని చెబుతుంటారు. తల్లి ప్రేమకు సాటి ఐనది ఈ ప్రపంచలో మరోకటి లేదు. తొమ్మిది నెలల పాటు కడుపులో బిడ్డను కాపాడుకుంటుంది. బిడ్డను జన్మనిచ్చిన తర్వాత కంటికి రెప్పలా కాపాడుకుంటుంది.   

2 /8

తమ పిల్లలను ఉదయం లేచినప్పటి నుంచి, అన్నం పెట్టడం, స్కూల్ కు రెడీ చేసి పంపడం, పిల్లాడు కళ్లముందు లేకపోయిన ఆలోచిస్తునే ఉంటారు. తమ గారాల బిడ్డ ఏంచేస్తున్నాడో అంటూ ఎప్పుడు చూసిన అదేధ్యాసలో ఉంటారు. ఇంట్లో ఏంజరిగిన కూడా తమ కొడుకును వెనకేసుకుని వస్తుంటారు.   

3 /8

మనుషులే కాదు. నోరులేనీ జీవాలు సైతం తమ పిల్లల పట్ల అంతే ప్రేమానురాగాలు కల్గి ఉంటాయి. తమ బిడ్డ జోలికి వస్తే ఎంత పెద్ద జంతువుతోనైన పొట్లాటకు రెడీ అయిపోతుంటాయి. జంతులలో కూడా తల్లి ప్రేమ మనుషుల్లాగానే ఉంటుంది. తమ పిల్లలను జంతులు కూడా కాపాడుకుంటు ఉంటాయి.  

4 /8

ఇక ప్రతి ఏడాది మదర్స్ డేను మే నెల రెండో ఆదివారంరోజున నిర్వహిస్తారు. దీని వెనుక కొన్ని కథనాలు తరచుగా వార్తలలో ఉంటాయి. ఇంగ్లాండ్ దేశంలో పదిహేడో శతాబ్దంలో తల్లులకు గౌరవంగా మదర్ సండే పేరితో ఉత్సవాలు జరిపేవారంట.   

5 /8

ఇక 1872 సంవత్సరంలో కూడాఆ జులియా వర్డ్ హవే అనే మహిళ తొలిసారిగా ప్రపంచంలో శాంతి నెలకొనాలని మదర్స్ డేను నిర్వహించారంట. మేరీ జర్విస్ అనే మహిళ.. మదర్స్ డే కోసం ఎంతో పాటుపడిందంట. ఆమె 1905 మే నెల 9 న చనిపోయిందంట. 

6 /8

ఆమె కూతురు.. మిస్ జర్విస్ మదర్స్ డే కోసం ఎంతో ప్రచారం నిర్వహించారంట. అమెరికాలో 1914 నుంచి అమెరికా ప్రెసిడెంట్ ఉడ్రోవిల్సన్ అధికారికంగా మే రెండో ఆదివారం నాడు మదర్స్ డే ను నిర్వహిస్తున్నారు. అప్పటి నుంచి మదర్స్ డేను ప్రతి ఏడాది మే నెల రెండో ఆదివారంనాడు జరుపుకుంటున్నాం.  

7 /8

మనకు ఆ దేవుడు కన్పించడు. అందుకు మనకు కంటి ముందు కన్పిస్తున్న మాతృ సమానులందరికి మాతృ దినోత్సవం నేపథ్యంలో శుభాకాంక్షలు. దేవుడు అన్ని చోట్ల ఉండలేకనే తల్లులను క్రియేట్ చేశారంటూ కూడా కొందరు తల్లి గొప్పతనం గురించి చెబుతుంటారు.

8 /8

కన్న తల్లి బిడ్డల కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది. అలాంటి తల్లికి మదర్స్ డే సందర్భంగా తనకు ఇష్టమైన కానుకలు లేదా మనస్సుకు హత్తుకునే సర్ ప్రైజ్ లను ఇవ్వడం ద్వారా మదర్స్ డేను వేడుకగా సెలబ్రేట్ చేసుకొవచ్చు.