Mouni Roy: మౌనీ రాయ్.. సినిమాలతో కంటే తన గ్లామర్ షోతో మోస్ట్ పాపులర్ అయింది. అంతేకాదు చేసిన సినిమాల కంటే తమ ఆటిట్యూట్ తో పాటు గ్లామర్ తో వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. ముఖ్యంగా 'నాగిని' సీరియల్లో తన నటన కంటే స్కిన్ షోతో ఆడియన్స్ ను ఫిదా చేసింది. స్మాల్ స్క్రీన్ నుంచి బిగ్ స్క్రీన్ పై తన గ్లామర్ తో హీట్ పుట్టిస్తోంది.
మౌనీ రాయ్ సినిమాల కంటే ముందు సీరియల్స్ తో పాపులర్ అయింది. ముఖ్యంగా హిందీలో తెరకెక్కిన పలు సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు దగ్గర అయింది. అంతేకాదు స్మాల్ స్క్రీన్ పై వచ్చిన పాపులారిటీతో బిగ్ స్క్రీన్ పై తన లక్ ను పరీక్షించుకుంది.
మౌనీరాయ్.. 2006లో 'క్యూ కీ సాస్ బీ కభీ బహు తీ' సీరియల్తో యాక్ట్రెస్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెరకెక్కిన 'నాగిని' సీరియల్తో ఓవర్ నైట్ పాపులర్ అయింది.
నాగిని సీరియల్తో వచ్చిన పాపులారిటీతో సినిమాల్లో అవకాశాలు కొట్టేసింది. ఫస్ట్ టైమ్ ఈమె పంజాబీ మూవీ 'హీరో హిట్లర్ ఇన్ లవ్' అనే మూవీతో కథానాయిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది.
హిందీలో తుమ్ బిన్ 2, సౌత్ లో కేజీఎఫ్ సినిమాలో ఐటెం సాంగ్లో యాక్ట్ చేసి నార్త్ టూ సౌత్ అన్ని ఇండస్ట్రీస్ జనాలను తనపైపు చూసేలా చేసింది. అంతేకాదు అప్పట్లోనే టీవీ నటిగా హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి చేరుకుంది మౌనీ రాయ్.
ముందుగా పంజాబీ సినిమాల్లో నటించిన మౌనీ రాయ్.. ఆ తర్వాత హిందీ చిత్రాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. 2018లో అక్షయ్ కుమార్ నటించిన 'గోల్డ్' మూవీతో హిందీ చిత్రసీమలో ఎంట్రీ ఇచ్చింది.
మోడలింగ్ నుంచి సినీ రంగంలో ప్రవేశించిన మౌనీ రాయ్ ఛాన్సుల కోసం ముంబైకు షిఫ్ట్ అయింది. ప్రస్తుతం ఆమె ఇన్స్టాగ్రామ్లో దాదాపు 32 మిలియన్స్ కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు .