Mrunal Thakur: ట్రెండీ లుక్ లో ఆకట్టుకుంటున్న సీత.. మృనాల్ ఠాకూర్ ఫొటోస్ వైరల్..!

Mrunal Thakur Hot Photos: సీతారామం సినిమాలో సీత క్యారెక్టర్ లో నటించి, సాంప్రదాయంగా కనిపించి,  అందరినీ ఆకట్టుకున్న మృనాల్ ఠాకూర్ తాజాగా ట్రెండీ లుక్ లో మరొకసారి ఆకట్టుకుంది.  తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలు చూసి అభిమానులు మోడ్రన్ సీతా అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

1 /5

మృణాల్ ఠాకూర్..ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.  తెలుగులో సీతారామం సినిమాతో అడుగుపెట్టి తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ చిన్నది,  సీత క్యారెక్టర్ లో అద్భుతంగా ఒదిగిపోయి తెలుగు అమ్మాయిలా తన అద్భుతమైన ప్రదర్శనతో ఆడియన్స్ హృదయాలను దోచుకుంది . ఈ సినిమా తర్వాత చాలా సినిమాలలో ఈమెకు ఆఫర్లు వచ్చాయి.

2 /5

అలా తెలుగులో వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా అందుకున్న ఈమె,  ఇటీవల విజయ్ దేవరకొండ తో ఫ్యామిలీ స్టార్, నానితో హాయ్ నాన్న చిత్రాలు చేసి మరొకసారి తన ఖాతాలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అంతే కాదు నానితో నటించిన హాయ్ నాన్న చిత్రానికి బెస్ట్ యాక్ట్రెస్ విభాగంలో ఫిలింఫేర్ అవార్డు కూడా సొంతం చేసుకుంది మృణాల్ ఠాకూర్.

3 /5

తన అంద చందాలతో అద్భుతమైన నటనతో విపరీతంగా ఆకట్టుకుంటున్న మృణాల్ ఒకప్పుడు బుల్లితెర ఆర్టిస్ట్ అంటే నమ్మడం అసాధ్యం. పలు హిందీ సీరియల్స్ లో నటిస్తూ కెరియర్ మొదలుపెట్టిన ఈమె,  ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు కూడా పోషించింది. ఆ తర్వాత గ్లామర్ షో చేస్తూ ఫాలోవర్స్ ను పెంచుకున్న ఈమెకు అదృష్టం తలుపు తట్టింది. అలా హీరోయిన్ గా మారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇక తన అందంతో నటనతో ఆకట్టుకున్న ఈమెకు  తెలుగు ప్రేక్షకులు తమ హృదయాలలో చోటు ఇచ్చారు.

4 /5

ఇకపోతే ఈ మధ్యకాలంలో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉన్న ఈమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ.. తన అందచందాలతో యువతకు మంచి ట్రీట్ ఇస్తోందని చెప్పవచ్చు. అందులో భాగంగానే తాజాగా ఈమె షేర్ చేసిన మరొక ఫోటోషూట్ అందరిని ఆకట్టుకుంటోంది. తాజాగా స్టైలిష్ ట్రెంచ్ కోట్ ధరించి తన అందాన్ని ఎలివేట్ చేసింది.

5 /5

మృణాల్ టోర్కాడోర్న్ బ్రాండ్ నుండి రూపొందిన క్రీం ఫాక్స్ లెదర్ ఫ్రెంచ్ కోట్ ధరించగా దీని ధర  రూ.12,995 అని సమాచారం. గోధుమ కలర్ కోట్ ఎంచుకున్న ఈ ముద్దుగుమ్మ దానిని  బోల్డ్ బ్లూ కార్సెట్ టాప్ తో జత చేసింది . ఇక ఇది ఈమె పై అందాలను హైలెట్ చేస్తోందని చెప్పవచ్చు. మొత్తానికి అయితే తన అందాలతో ఆకట్టుకుంది మృణాల్ ఠాకూర్.