Mrunal Thakur: స్టైలిష్ లుక్స్ తో అలరించిన మృణాల్.. హీట్ పెంచుతున్న హీరోయిన్

Mrunal Thakur stylish photos: మృణాల్ ఠాకూర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. బాలీవుడ్ సీరియల్స్ లో తన కెరీర్ మొదలు పెట్టిన ఈ హీరోయిన్ తెలుగులో మంచి పేరు తెచ్చుకుంది. వరస విజయాలు సాధించి.. ప్రస్తుతం ఎన్నో ఆఫర్లు సొంతం చేసుకోండి ఈ భామ. ఈ క్రమంలో ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు సైతం తెగ వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి. 

1 /5

హిందీ భాషలో సీరియల్స్ ద్వారా నటన ప్రారంభించిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఆ తర్వాత హిందీలో పలు సినిమాలలో నటించింది. హృతిక్ రోషన్తో చేసిన సూపర్ 30 సినిమా మృణాలకి మంచి పేరు తెచ్చిపెట్టింది. కాగా సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ హీరోయిన్. 

2 /5

దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపుడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం సీతారామం. ఈ సినిమాలో సీతా పాత్రలో కనిపించి అందరి మదిని సొంతం చేసుకునింది మృణాల్ ఠాకూర్. ఈ సినిమా మంచి విషయం సాధించడమే కాకుండా ఈ హీరోయిన్ కి ఎన్నో అవకాశాలు తెచ్చిపెట్టింది. 

3 /5

ఆ తరువాత నాని హీరోగా వచ్చిన హాయ్ నాన్న సినిమాలో కనిపించింది. ఈ సినిమాలో యష్ణా పాత్రలో కనిపించి మరోసారి ప్రేక్షకుల మదిని దోచుకుంది ఈ హీరోయిన్. ఈ సినిమా కూడా కమర్షియల్ గా మంచి విజయం అందుకుంది. అలానే మృణాల్ కి కూడా మంచి పేరు తెచ్చి పెట్టింది. 

4 /5

ఇక తన మూడో సినిమాగా వచ్చిన ఫ్యామిలీ స్టార్ మాత్రం మృణాల్ కి పెద్ద షాక్ మిగిల్చింది. పరశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమా ఈ హీరోయిన్ కి తెలుగులో మొదటి పరాజయాన్ని పరిచయం చేసింది. 

5 /5

ఇక ఈ మధ్యనే ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. ఈ చిత్రంలో మృణాల్ కేవలం 10 నిమిషాలు మాత్రమే కనిపించడం గమనర్హం. చిరంజీవి విశ్వంబరా సినిమాలో కూడా ఈ హీరోయిన్ ఉన్నట్టు వినికిడి. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతూ అందరిని ఆకర్షిస్తున్నాయి.