Mukesh ambani: అదృష్టమంటే అంబానీ కుక్కదే.. ఎన్నికోట్ల ఖరీదైన కారు ఉందో తెలుసా..?


Mukesh ambani petdog lucky: అనంత్ అంబానీ రాధిక మర్చంట్ లో పెళ్లి వేడుక కన్నుల పండుగగా జరిగింది.ఈ వేడుకకు అన్నిరంగాలకు  చెందిన ప్రముఖులు హజరయ్యారు. ముంబైలోని జియోకన్వెన్షన్ సెంటర్ లో వీరి పెళ్లి వేడుక జరిగింది.
 

1 /6

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ కుమారుడి పెళ్లి వేడుక చరిత్రలో గుర్తుండిపోయేలా జరిగిందని చెప్పుకొవచ్చు. మన దేశం నుంచి మాత్రమే కాకుండా.. దేశవిదేశాల నుంచి సైతం అతిథులు భారీగా తరలివచ్చారు.ఈ క్రమంలో ముంబైలోని జియోకన్వెన్షన్ లో వేడుకగా పెళ్లి జరిగింది. 

2 /6

అనంత్ అంబానీ, రాధికల పెళ్లికి బాలీవుడ్, హలీవుడ్, కోలీవుడ్ తోపాటు, రాజకీయ రంగం, క్రీడల నుంచి కూడా ఎందరో వీఐపీలు, వీవీఐపీలు పెద్ద ఎత్తున హజరయ్యారు. రాధిక అనంత్ ల పెళ్లి మాత్రం న భూతో.. నా భవిష్యత్ అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ముంబైలో అంత మంది అతిథులు ఒక్కసారిగా రావడం, వందలాదిగా సెలబ్రీటీస్ లు ఒకే వేదికపై కన్పించి అందరిని ఉత్సాహ పరిచారు. అనంత్ ఫ్యామిలీ సైతం అతిథిమర్యాదాల్లో ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. 

3 /6

అనంత్ రాధికల పెళ్లికి ముందు 50 మంది పేదలకు పెళ్లి కార్యక్రమాలు జరిపించారు. భారీగా బహుమతులు సైతం అందించారు. పెళ్లిలో ప్రతిరోజు.. అతిథులకు దాదాపు 3 వేల వెరైటీల వంటకాలను సిద్దంగా ఉంచారు. అంతేకాకుండా.. పెళ్లికి వచ్చిన అతిథులు సైతం.. తమ డ్యాన్స్ లతో అక్కడున్నవారిని ఆశ్చర్యపర్చారు. పెళ్లికి వచ్చిన వారికి సైతం అంబానీ ఫ్యామిలీ కాస్లీ గిఫ్ట్ లు, ఉద్యోగులకు సర్ ప్రైజ్ లు కూడా ఇచ్చారు.

4 /6

ఇదిలా ఉండగా.. ఇప్పుడు అంబానీ ఇంట్లో ఉన్న శునకం ప్రస్తుతం వార్తలలో నిలిచింది. ముఖేష్ అంబానీ తన ఇంట్లో కొన్నేళ్లుగా ఒక శునకంను పెంచుకుంటున్నారు. దానికి ప్రత్యేకంగా ఒక లగ్జకీ కారు కూడా ఉందంట. కారు లేనిదే..శునకం అడుగు బైటకు పెట్టదంట. ఈ లగ్జరీ కారు గురించి వార్త ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారింది.

5 /6

అంబానీ వాళ్ల ఇంట్లో ఉన్న హ్యాపీ అనే కుక్క కోసం మెర్సిడీజ్ బెంజ్ జీ 400డీ కారు ఉందంట.  దీని ఖరీదు రూ. 4 కోట్లని తెలుస్తోంది. అంబానీకి భద్రత కోసం... జీ 63 ఏఎంజీ వంటి హై ఎండ్ వాహనాలు ఉన్నాయి. శునకానికి మాత్రం.. జీ 400 డీ కారు ప్రత్యేకంగా శునకం కోసం ఖరీదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో చాలా మంది ఈ విషయం తెలిసి ముక్కున వేలేసుకుంటున్నారు.

6 /6

నీతా అంబానీ పెళ్లి తర్వాత మీడియా వాళ్లకు రెండుచేతులు జోడించి మరీ సారీ చెప్పారు. పెళ్లి ఇంట్లో ఏవైన లోపాలు జరిగుంటే పెద్ద మనస్సుతో పట్టించుకోవద్దని,పెళ్లన్నాక.. కొన్నిపొరపాట్లు జరగటం జరుగుతాయని నీతాచెప్పారు. అంత సంపన్నుడికి అర్ధాంగీ అయివుండి కూడా సారీ చెప్పడం పట్ల దేశమంతా కూడా నీతా ది గ్రేట్.. అంటూ కూడా పొగడ్తలు కురిపించారు.