Naga Chaitanya: 'పెళ్లి తరువాత జీవితం అంటే నా దృష్టిలో అదే..' సమంతపై నాగచైతన్య అదిరిపోయే పంచ్..?

Samantha : నాగచైతన్య, శోభిత త్వరలోనే పెళ్లి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ డిసెంబర్ 4న ఒకటవుతున్నారు అని.. పెళ్లి కార్డ్స్ కూడా ప్రింట్ చేయించేసారు అక్కినేని కుటుంబం. ఈ క్రమంలో.. నాగచైతన్య మీడియాకి ఇస్తున్న.. కొన్ని ఇంటర్వ్యూస్ లో ఆయన చెప్పిన మాటలు తెగ వైరల్ అవుతున్నాయి..

1 /5

నాగచైతన్య, శోభిత గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సమంతతో విడాకులు తరువాత శోభిత ప్రేమలో పడిన నాగచైతన్య.. ఈ మధ్యనే పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం జరుపుకున్నారు. 

2 /5

ఇక వీరిద్దరూ డిసెంబర్ 4న ఒకటవుతున్నారు. వీరిద్దరికీ సంబంధించిన పెళ్లి కార్డు సైతం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ విషయాలను కాసేపు పక్కన పెడితే.. నాగచైతన్య, శోభిత కన్నా కూడా.. నాగచైతన్య, సమంతకి తెలుగు ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ వేరు.

3 /5

ఒకరకంగా నాగచైతన్య కన్నా సమంతకు వందరెట్లు పాపులారిటీ ఉంది.. అనేది అందరికీ తెలిసిన విషయమే. అందుకని నాగచైతన్యతో పెళ్లయిన తర్వాత కూడా సమంత ఎన్నో సినిమాలలో నటించింది. కాగా వీరిద్దరి మధ్య పిల్లల గురించి చర్చ వచ్చే విరిపోయారు అని.. తెగ వార్తలు వినిపించాయి. అయితే చాలామంది సమంత పిల్లల్ని కనాలి అనుకుంటే చైతన్య మాత్రం ఒప్పుకోలేదు అంటూ చెప్పుకొచ్చారు. 

4 /5

కానీ ఇప్పుడు అలా రూమర్స్ ప్రెస్ చేసిన వాళ్లకి.. ముఖ్యంగా సమంత అభిమానులకి నాగచైతన్య పెద్ద పంచ్ ఇచ్చారు. మీ దృష్టిలో శోభితతో హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అంటే ఏమిటి అని ఆయన్ని ఇంటర్వ్యూలో అడగగా.. నా దృష్టిలో హ్యాపీ మారేజ్ లైఫ్ అంటే.. నేను, శోభిత.. ఆ తరువాత ఇద్దరు పిల్లలు అందు సమాధానం ఇచ్చారు.

5 /5

ఇక దీంతో నాగచైతన్య కి పిల్లల్ని కనాలని ఉందని.. కాబట్టి అప్పట్లో సమంతతో విడిపోవడానికి ఇది అసలు కారణం అవ్వకపోయిందచ్చని.. సమంత అభిమానులు ఇలా ఏవేవో సృష్టించారని.. నాగచైతన్య అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.