Navaratri 2024: భారత్‌లో కాకుండా ఈ 5 దేశాల్లో కూడా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు...

Navaratri 2024 celebration:  నవరాత్రుల్లో దుర్గామాత పూజను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అమ్మవార్లను వివిధ రూపాల్లో అలంకరిస్తారు. మన దేశవ్యాప్తంగా ఈ ఉత్సవాలు అంబరాన్నుంటుతాయి. అయితే, నవరాత్రులు కేవలం మన దేశంలోనే కాదు మరో 5 దేశాల్లో కూడా జరుపుకొంటారు. అవేంటో తెలుసుకుందాం.
 

1 /5

నేపాల్.. ముందుగా చెప్పుకోవాల్సింది నేపాల్‌. ఈ దేశంలో కూడా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుపుకొంటారు. ఇక్కడ దసరాను దశాయన్‌ అని పిలుస్తారు. మన దేశం మాదిరి ఇక్కడ కూడా స్కూళ్లు కాలేజీలకు సెలవు ప్రకటిస్తారు. నవదుర్గలను 10 రోజులపాటు పూజించే ఆచారం నేపాల్‌లో కూడా ఉంది.  

2 /5

ఆస్ట్రేలియా.. నవరాత్రులను ఆస్ట్రేలియాలో కూడా అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు.ఇక్కడి భారత కుటుంబాలు దుర్గామాతను పూజిస్తారు. ఆస్ట్రేలియాలో 1974 నుంచి దుర్గామాతను పూజిస్తున్నారు. మెల్‌బర్న్‌లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.

3 /5

బంగ్లాదేశ్‌.. సాధారణంగా మన దేశం మాదిరి బంగ్లాదేశ్‌లో కూడా నవరాత్రి ఉత్సవాలు జరుపుకొంటారు. అక్కడి హిందువులు దుర్గామాతను పూజిస్తారు. కానీ, ఇటీవల బంగ్లాదేశీయులు హిందువులపై దాడి నేపథ్యంలో ఎలా జరుగుతుందో తెలీదు.

4 /5

యూఎస్‌ఏ.. ఇక్కడ సెట్టిల్‌ అయిన బెంగాలీలు యూఎస్‌ఏలో 1970లో ప్రారంభించారు.యూఎస్‌ఏ లో ఎక్కువమంది ఉన్నారు. కాబట్టి అక్కడి భారతీయులు ఈ దుర్గామాత పూజను నిర్వహించుకుంటారు. అక్కడి దుర్గా భక్తులు అంతా ఒక్కదగ్గరకు చేరుకుని వైభవంగా దుర్గాపూజలు చేసుకుంటారు.

5 /5

యూకే.. యూకేలో కూడా దుర్గామాత పూజను వేడుకగా జరుపుకొంటారు. అమ్మ వారి ప్రతిమలను మన దేశంలో మాదిరి ఏర్పాటు చేసుకుంటారు. హిందూ సంప్రదాయబద్ధంగా దుర్గాపూజ చేసుకుంటారు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)