NCERT 2024: NCERT సువర్ణావకాశం.. 123 పోస్టులతో పర్మినెంట్‌ ఉద్యోగాలు ఈ లింక్‌ ద్వారా నేరుగా అప్లై చేయండి..

NCERT Recruitment 2024 Apply Link: నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (NCERT) జాబ్‌ అప్లికేషన్స్‌ ఆహ్వానిస్తోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎన్‌సీఈఆర్‌టీ అధికారిక వెబ్‌సైట్‌ ncert.nic.in దరఖాస్తు చేసుకోవచ్చు.
 

1 /5

ఈ నోటిఫికేషన్‌ ద్వారా ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇది న్యూ ఢిల్లీలో ఉంది. దీనికి సంబంధించిన ఇతర యూనిట్లు అజ్మీర్‌, భోపాల్‌, భువనేశ్వర్‌, మైసూర్‌, షిల్లాంగ్‌లో ఉన్నాయి.   

2 /5

ఎన్‌సీఈఆర్‌టీ కు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 16. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు యూఆర్‌/ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ చెందినవారైతే రూ. 1000 చెల్లించాలి. కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. మహిళ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కు చెందినవారికి ఎటువంటి ఫీజు లేదు.  

3 /5

దరఖాస్తు ఇలా చేయండి.. ncert.nic.in వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయండి ఆ తర్వాత హోంపేజీలో వేకెన్సీ సెకషన్‌ ఎంపిక చేయాలి.  ఒక కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది. అక్కడ 'Apply Now'పై క్లిక్‌ చేసి మీ వివరాలను నమోదు చేయాలి. 

4 /5

మీ రిజిస్ట్రేషన్‌, పాస్వర్డ్‌ను ఉపయోగించి లాగిన్‌ అవ్వాలి.  మీరు ఎంపిక చేసుకుంటున్న పోస్టులు సెలక్ట్‌ చేసి చివరగా సబ్మిట్‌ కొట్టాలి. ప్రింటౌట్‌ తీసుకుని పెట్టుకోవాలి.

5 /5

పే స్కేల్‌.. ప్రొఫెసర్‌ అకడమిక్‌ లెవల్ 14 అప్లై చేసుకున్నవారికి రూ. 1,44,200, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ రూ. 1,31,400, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ లెవల్‌ 10 అకడమిక్‌ రూ. 57,700.