Who is Neeraj Chopra Girlfriend: ప్రస్తుతం నీరజ్ చోప్రా పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది. పారిస్ ఒలింపిక్స్‌లో రజతం గెలిచి చరిత్ర సృష్టించిన ఈ బల్లెం వీరుడు.. భారత్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాడు. జావెలిన్ త్రోలో సిల్వర్ మెడల్ సాధించి దేశం జెండాను ప్రపంచ యావనికపై రెపరెపలాడించాడు. ఈ నేపథ్యంలో నీరజ్ చోప్రా గురించి ఎక్కువ మంది గూగుల్‌లో సర్చ్ చేస్తున్నారు. అతని గర్ల్ ఫ్రెండ్ ఎవరు అని వెతుకుతున్నారు. అయితే నీరజ్ పెళ్లిపై అతని తండ్రి ఏం చెప్పాడు..? నీరజ్ చోప్రా క్రష్ ఎవరు..?
టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం, పారిస్ ఒలింపిక్స్‌లో రజతం నెగ్గి సరికొత్త చరిత్ర సృష్టించిన భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. తన ఆటతోనే కాదు.. స్టైలిష్ లుక్‌తో ఎంతోమంది అమ్మాయిల మనసు దోచుకున్నాడు.
నీరజ్ చోప్రా వ్యక్తిగత విషయాల గురించి ప్రస్తుతం గూగుల్‌లో ఎక్కువ మంది వెతుకుతున్నారు. అతని వయసు ఎంత..? అతని గర్ల్ ఫ్రెండ్ అని సెర్చ్ చేస్తన్నారు.
నీరజ్ చోప్రా తన వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా బయటకు వెల్లడించలేదు. గర్ల్‌ఫ్రెండ్, పెళ్లి గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. క్లారిటీ ఇచ్చేశాడు.
అందరూ తనపై ఇంత ప్రేమను చూపిస్తుండడం ఆనందంగా ఉందన్నాడు. అయితే తనకు గర్ల్‌ఫ్రెండ్ లేదని.. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా లేదని తేల్చేశాడు.
తన కెరీర్ ఆరంభంలో లాట్వియన్ జావెలిన్ త్రోయర్‌పై ప్రేమను పెంచుకున్నట్లు చెప్పాడు.
2024 ఒలింపిక్స్ తర్వాత తమ కుమారుడి పెళ్లి గురించి ఆలోచిస్తామని నీరజ్ చోప్రా తండ్రి గతంలో ఓసారి తెలిపారు.