Neeraj Chopra Records: 40 ఏళ్ల తర్వాత ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌గా నిలిచిన తొలి భారతీయుడిగా నీరజ్ చోప్రా చరిత్రను తిరగరాశాడు. ఆదివారం బుడాపెస్ట్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2023లో పురుషుల జావెలిన్ ఈవెంట్‌లో విజేతగా నిలిచాడు. నీరజ్ చోప్రా కెరీర్‌లో సాధించిన అత్యుత్తమ విజయాలపై ఓ లుక్కేయండి.
పోలాండ్‌లో జరిగిన జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా 86.48 మీటర్లు విసిరి.. కొత్త అండర్-20లో ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. హోల్డర్ లాట్వియాకు చెందిన జిగిస్మండ్స్ సిర్మైస్ స్థాపించిన 84.69 మీటర్ల రికార్డును బ్రేక్ చేశాడు. నీరజ్ చోప్రా బైడ్‌గోస్జ్‌లో 86.48 మీటర్లు ఇప్పటికీ అండర్-20 ప్రపంచ రికార్డు పదిలంగా ఉంది. (ఫోటో: ANI)
పోలాండ్‌లోని బైడ్‌గోస్జ్‌లో జరిగిన 2016 IAAF వరల్డ్ వరల్డ్ 20 ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా బంగారు పతక విజయం భవిష్యత్ ఒలింపిక్ ఛాంపియన్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ విజయంతో అప్పటి 18 ఏళ్ల నీరజ్ చోప్రా మొదటి ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్‌గా నిలిచాడు. (ఫోటో: ANI)
టోక్యో ఒలింపిక్స్ 2020లో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించి రికార్డు సృష్టించాడు. అథ్లెటిక్స్‌లో భారత్ సాధించిన మొట్టమొదటి పతకం ఇది. 2008 బీజింగ్ గేమ్స్‌లో షూటింగ్‌లో అభినవ్ బింద్రా సాధించిన తర్వాత ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇది రెండో వ్యక్తిగత స్వర్ణం. (ఫోటో: ANI)
నీరజ్ చోప్రా 2018 సంవత్సరంలో కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలలో స్వర్ణం సాధించాడు. ఈ సంవత్సరం చైనాలో జరిగే ఆసియా క్రీడల స్వర్ణాన్ని కాపాడుకోవాలని ధీమాతో ఉన్నాడు. (ఫోటో: AP)
గతేడాది స్టాక్‌హోమ్ డైమండ్ లీగ్‌లో నీరజ్ 89.94 మీటర్లు విసిరి పురుషుల జావెలిన్‌లో జాతీయ రికార్డును సొంతం చేసుకున్నాడు. (ఫోటో: AP)
గతేడాది జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా రజతం సాధించి మళ్లీ చరిత్ర లిఖించాడు. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన రెండో భారతీయుడిగా నిలిచాడు. లాంగ్ జంప్‌లో అంజు బాబీ జార్జ్ ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలు. (ఫోటో: AP)
40 ఏళ్ల ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన తొలి భారతీయుడిగా నీరజ్ చోప్రా నిలిచాడు. బుడాపెస్ట్‌లో ఆదివారం జరిగిన పురుషుల జావెలిన్ ఈవెంట్‌లో నీరజ్ చోప్రా 88.17 మీటర్ల దూరం విసిరి విజేతగా నిలిచాడు. (ఫోటో: AP)
గతేడాది జ్యూరిచ్‌లో జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్‌లో 88.44 మీటర్ల త్రోతో నీరజ్ చోప్రా ప్రతిష్టాత్మక టైటిల్‌ను గెలుచుకున్న మొదటి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. (ఫోటో: AP)