Andhra Pradesh Cyclone Effect: కొన్ని రోజులుగా ఏర్పాడుతున్న అల్పపీడనాల వల్ల బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే, ప్రస్తుతం తుఫాను ముప్పు ఏపీకి తప్పిపోయిందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర తుఫాను ముప్పు తప్పిందని వాతావరణ శాక చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల తీవ్ర తుఫానుగా మారుతుందని అంచనా వేసింది భారత వాతావరణ శాఖ.
తీవ్ర తుఫానుగా మారలేదని ఈరోజు సాయంత్రానికి బలహీనపడుతుంది. రేపు తీరం దాటనుంది. అయితే, వాయుగుండం నేపథ్యంలో రెండు రోజులపాటు రాయలసీమ, కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
మత్స్యకారులను కూడా సముద్రంలో వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది వాతావరణ శాఖ. శుక్ర, శనివారం రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయి. కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉంది.
వర్షాల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లోని ప్రజలను అలెర్ట్ చేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో స్కూళ్లు, ఇతర విద్యాశాఖలకు కూడా కీలక ఆదేశాలు జారీ చేశారు. స్కూళ్లకు సెలవులు ఇవ్వలని కోరారు. ఆయా ప్రాంతంలో వర్ష ప్రభావాన్ని బట్టి విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని కోరింది.
గత కొద్ది రోజులుగా బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు కూడా వచ్చిన దాఖలాలు ఉన్నాయి. ప్రస్తుతం కూడా ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది.