NTR 31: ఎంత కాలంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురు చూస్తోన్న రానే రోజు వచ్చింది. తాజాగా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ మూవీ ఓపెనింగ్ లోవాళ్లిద్దరే హైలెట్ గా నిలిచారు.
NTR 31: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ ఎట్టకేలకు పూజా కార్యక్రమాలతో ఈ రోజు ప్రారంభమైంది. ఈ వేడుకల్లో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, ప్రశాంత్ నీల్, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు హాజరయ్యారు.
ఈ వేడుకలో ఎన్టీఆర్ ఫస్ట్ షాట్ కు క్లాప్ ఇచ్చాడు. ఈ వేడుకకు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి హాజరైంది. అంతేకాదు ఎన్టీఆర్ కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లు హాజరు కావడంపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.
అంతేకాదు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ ఓపెనింగ్ లో వీళ్లిద్దరే హైలెట్ గా నిలిచారు.అందరి చూపు కూడా వాళ్లపైనే ఉంది. నందమూరి ఫ్యామిలీ నుంచి నాల్గో తరం హీరోలు రెడీగా ఉన్నారంటూ కామెంట్స్ వినబడుతున్నాయి.
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన ఎవరు నటిస్తున్నారు. మిగతా నటీనటుల ఎంపిక జరగాల్సి ఉంది.
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రాన్ని 2016 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. అంతా అనుకున్నట్టే జరిగితే.. ఆ డేట్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనేది చూడాలి.