Onions price hike news: ఉల్లి పాయ ధరలు దేశ రాజధాని ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయని చెప్పుకొవచ్చు. కొన్ని నెలలుగా ఉల్లి ధరలు ఏ మాత్రం తగ్గకుండా రాకెట్ లా పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ప్రజలు బెంబెలెత్తిపోతున్నట్లు తెలుస్తొంది.
దేశ రాజధాని ఢిల్లీలో ఉల్లిపాయల ధరలు కొన్నిరోజులుగా ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు మాత్రం తెగ ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తొంది. కొన్ని నెలల క్రితం కేజీ 50 రూపాయలలోపు ఉన్న ఉల్లి ధరలు ప్రస్తుతం సెంచరీ దాటేసినట్లు తెలుస్తొంది.
సాధారణంగా వంటకాలలో ఉల్లిపాయల్ని తప్పకుండా ఉపయోగిస్తుంటారు. ఉల్లి, వెల్లుల్లీ లేనిది అసలు ఏ వంట కూడా చేయడం అసలు పాజిబిల్ కాదని కూడా చెప్పుకొవచ్చు. ఇలాంటి నేపథ్యంలో ఉల్లి ధరలు పెరుగుతుండటంతో సామాన్యుడు బెంబెలెత్తిపోతున్నాడు.
నిన్న, మొన్నటి వరకు కిలో రూ. 40 వరకు ఉన్న ఉల్లి ధరలు ఇప్పుడు రెట్టింపయినట్లు సమాచారం ఇక ముంబై, ఢిల్లీ లోని కొన్ని ప్రాంతాల్లో కిలో ఉల్లి ధర ఏకంగా రూ. 100 పలుకుతోందని, మరికొన్ని చోట్ల కేజీకి 120 సైతం విక్రయిస్తున్నట్లు సమాచారం..
ఇక హోల్ సేల్ మార్కెట్ లో కిలో ఉల్లి ప్రస్తుతం రూ. 40 నుంచి 60 పలుకుతుండగా.. తాజా అది రూ. 70 నుంచి 80 రూపాయలకు పెరిగింది. మరికొద్ది రోజుల్లో హోల్ సేల్ మార్కెట్ లోనే కిలో ఉల్లి రూ. 100 చేరుకునే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు.
దీంతో ఉల్లి కొనాలంటే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది. వంటింట్లో ఉల్లి లేనిదే ఏ వంట పూర్తి కాదు. అయితే ఉల్లి ధరలు పెరుగుదలకు ద్రవ్యోల్బణం ప్రభావం కూడా ఉందని నిపుణులు చెప్తున్నారు. చాలా మంది జనాలు మాత్రం ఉల్లిని కొనకముందే కన్నీళ్లు తెప్పిస్తుందని కూడా సెటైరీక్ గా కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఉల్లి ధరలు, వెల్లుల్లి రెట్లు ఢిల్లీలోనే కాకుండా.. ముంబై, లక్నోలో కూడా చుక్కలు చూపిస్తున్నాయని తెలుస్తొంది. అక్కడ కూడా కేజీ ఉల్లిధరలు వంద దాటేశాయంట.