OPPO Find X8 5G Price: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో OPPO Find X8 5G స్మార్ట్ ఫోన్ పై ప్రీ ఆర్డర్స్ ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా కొనుగోలు చేసే వారికి అత్యంత తగ్గింపు ధరకే ఈ మొబైల్ లభించబోతోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా అనేక రకాల బ్యాంక్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.
OPPO Find X8 5G Price: అత్యంత శక్తివంతమైన స్మార్ట్ ఫోన్స్‌కి ఒప్పో కేరాఫ్ అడ్రస్. ఈ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఎప్పుడు మార్కెట్లోకి కొత్త కొత్త మొబైల్స్‌ను విడుదల చేసిన అవి శక్తివంతమైన కెమెరాతో అందుబాటులోకి వస్తాయి. అలాగే వాటిని అత్యంత చౌక ధరలోనే విక్రయించేందుకు ఒప్పో కృషి చేస్తూ ఉంటుంది. మిడిల్ రేంజ్ బడ్జెట్ లోనే ఒప్పో మొబైల్ కంపెనీ ఇటీవల శక్తివంతమైన స్మార్ట్ ఫోన్ విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే.
ఈ OPPO Find X8 5G స్మార్ట్ ఫోన్ ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి వచ్చింది. దీనిని కంపెనీ మోస్ట్ పవర్ఫుల్ కెమెరాతో లాంచ్ చేసింది. అయితే త్వరలోనే ఈ మొబైల్ కు సంబంధించిన మొదటి సేల్ కూడా ప్రారంభం కాబోతోంది.
ఈ OPPO Find X8 5G స్మార్ట్ ఫోన్ మొదటి సేల్లో భాగంగా కొనుగోలు చేసే వారికి అత్యంత తగ్గింపు ధరకే ఈ మొబైల్ లభించబోతోంది. అయితే దీనిపై ఉన్న ఆఫర్స్ ఏంటో..? పూర్తి వివరాలు కూడా తెలుసుకోండి.
ఈ OPPO Find X8 5G స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. దీనిని ఒప్పో కంపెనీ రెండు స్టోరేజ్ వేరియంట్లలో పాటు రెండు కలర్ ఆప్షన్స్‌తతో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులోని 256 జీబీ వేరియంట్ ధర MRP ధర రూ.79,999తో అందుబాటులో ఉంది.
ఇక దీనిని మొదటి సేల్లో భాగంగా కొనుగోలు చేసే వారికి 12 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. దీనిపై ఉన్న తగ్గింపు పోను కేవలం రూ.69,999కే పొందవచ్చు. ఇక దీనిపై అదనంగా అనేక రకాల బ్యాంక్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగించి కొనుగోలు చేసే వారికి ప్రత్యేకమైన తగ్గింపు లభించబోతోంది.
ఇక ఈ OPPO Find X8 5G మొబైల్ పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళ్తే.. ఈ మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకునేవారు ఎస్బిఐ బ్యాంకు క్రెడిట్ కార్డును వినియోగించి పేమెంట్ చేస్తే ఏకంగా రూ.6,999 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులను వినియోగించి కూడా ఇదే మొత్తంలో తగ్గింపు పొందవచ్చు. ఇక భారీ మొత్తంలో డిస్కౌంట్ పొందాలనుకునేవారు ఫ్లిప్‌కార్ట్ అనుసంధాన యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డును వినియోగించి పేమెంట్ చేస్తే రూ.10 వేల వరకు తగ్గింపు లభిస్తుంది.
అలాగే ఫెడరల్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంకులను వినియోగించి పేమెంట్ చేసిన రూ.7,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇక ఈ మొబైల్ పై ఉన్న అన్ని ఆఫర్స్ పోనూ రూ.59,000కే కొత్త OPPO Find X8 5G మొబైల్ పొందవచ్చు. ఇక ఇప్పటికే ఈ OPPO Find X8 5G మొబైల్‌కు సంబంధించిన ప్రీ ఆర్డర్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది ఫ్లిప్‌కార్ట్‌లో ప్రీ ఆర్డర్ చేసుకునే వారికి అదనంగా మరెన్నో డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.