ఫోటో గ్యాలరీ : తన మాజీ భార్య రీనా దత్తతో కలిసి కనిపించిన అమీర్ ఖాన్

పునీత్ మల్హోత్రా బర్త్ డే పార్టీలో తన మాజీ భార్య రీనా దత్తతో కలిసి కనిపించిన అమీర్ ఖాన్

  • Jan 20, 2019, 16:49 PM IST

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు పునీత్ మల్హోత్రా బర్త్ డే పార్టీకి తన మాజీ భార్య రీనా దత్తాతో కలిసి హాజరైన అమీర్ ఖాన్ అక్కడున్న మీడియా కెమెరాలకు చిక్కారు. దీంతో మరోసారి అమీర్ ఖాన్ వ్యక్తిగత జీవితం మీడియా కళ్ల ముందు మెదిలింది. అమీర్ ఖాన్, రీనా దత్తా చాలా ఏళ్ల క్రితమే విడిపోయినప్పటికీ.. అప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య సత్సంబంధాలు కొనసాగుతూనే వున్నాయి. ఇప్పటికీ రీనా దత్తాను అమీర్ ఖాన్ తన జీవితంలో ఓ ముఖ్యమైన భాగంగానే పరిగణిస్తారు. ఈ పార్టీకి కరణ్ జొహర్, పరిణీతి చోప్రా, డయానా పెంటి వంటి ఇతర సినీ ప్రముఖులు సైతం హాజరయ్యారు.

1 /2

ఫోటో గ్యాలరీ : ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు పునీత్ మల్హోత్రా బర్త్ డే పార్టీకి తన మాజీ భార్య రీనా దత్తతో కలిసి వస్తూ మీడియా కెమెరాలకు చిక్కిన అమీర్ ఖాన్ (Pic: Yogen Shah)

2 /2

ఫోటో గ్యాలరీ: తన మాజీ భార్య రీనా దత్తతో కలిసి పునీత్ మల్హోత్రా బర్త్ డే పార్టీకి హాజరవుతున్న అమీర్ ఖాన్   (Pic: Yogen Shah)