Pitru Paksha: శ్రాద్ధం పెట్టేందుకు కొడుకు లేకుంటే ఎలా? హిందూ ధర్మం ఏం చెబుతుందో తెలుసా

If No Son Who Can Perform Shraddha Here Hindu Dharma: హిందూ మతంలో పితృ పక్షానికి ఎంతో విశిష్టత ఉంది. ఇంట్లో చనిపోయిన వారి ఆత్మ శాంతి కోసం కుటుంబసభ్యులు శ్రాద్ధం చేయడం ఆనవాయితీ. పూర్వీకుల శ్రాద్ధ ఆచారాలు, తర్పణం, పిండం మొదలైనవి చేస్తారు. పూర్వీకులను పూజిస్తే ఇంట్లో సుఖసంతోషాలు, ఐశ్వర్యం, లభిస్తాయనే నమ్మకం ఉంది. అయితే కొడుకులు లేకుంటే ఏం చేయాలో తెలుసా?

1 /9

Pitru Paksha 2024: పితృ పక్షం భాద్రపద పౌర్ణమి రోజు నుంచి ప్రారంభమై అశ్విన్ అమావాస్య రోజున ముగుస్తుంది.

2 /9

Pitru Paksha 2024: పితృ పక్షం17 సెప్టెంబర్ 2024 నుంచి ప్రారంభమై 2 అక్టోబర్ 2024న ముగియనుంది. మొత్తం 16 రోజులలో పూర్వీకుల శ్రాద్ధ కర్మలు, తర్పణం, పిండ ప్రదానం చేయాలి.

3 /9

Pitru Paksha 2024: పితృ పక్షంలో చనిపోయిన వారి ఆత్మ శాంతి, సంతృప్తి కోసం పూజలు, శ్రాద్ధ కర్మలు నిర్వహించాలి. పూర్వీకులను పూజిస్తే సుఖసంతోషాలు, ఐశ్వర్యం లభిస్తాయనే నమ్మకం ప్రగాఢంగా ఉంది.

4 /9

Pitru Paksha 2024: అయితే కుమారులు లేని వారికి శ్రాద్ధం ఎవరు చేస్తారనే సందేహాలు ఉన్నాయి. కుమారుడు లేకపోతే ఎవరు శ్రాద్ధ కర్మలు చేయాలనే దానిపై హిందూ ధర్మశాస్త్రాలు కొన్ని సూచనలు చేస్తున్నాయి.

5 /9

Pitru Paksha 2024: హిందూ మత గ్రంథాల ప్రకారం పెద్ద కుమారుడికి శ్రాద్ధం చేసే మొదటి అర్హత ఉంది. పెద్ద కొడుకు చనిపోతే.. లేకపోయినా లేదా కొన్ని కారణాల వల్ల శ్రాద్ధం చేయలేకపోయినా చిన్న కొడుకు శ్రాద్ధం చేయవచ్చు.

6 /9

Pitru Paksha 2024: కొడుకు లేకపోతే అతడి భార్య శ్రాద్ధం చేయవచ్చు. ఈ విషయాన్ని హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి. 

7 /9

Pitru Paksha 2024: కుటుంబంలో ఒక్క కూతురు మాత్రమే ఉంటే ఆమె కుమారుడు అంటే మనవడు కూడా శ్రాద్ధం చేయవచ్చు. ఇక సోదరుడి కొడుకు అంటే మేనల్లుడు కూడా శ్రద్ధ చేయవచ్చు.

8 /9

Pitru Paksha 2024: ప్రతిపాద తిథి నాడు మరణించిన వారికి శ్రాద్ధం చేస్తారు. ఈ రోజున పూర్వీకులకు తర్పణం, పిండదానం చేయాలి.

9 /9

Pitru Paksha 2024: శ్రాద్ధ పక్షంలో అంటే పితృపక్షంలో శుభకార్యాలు చేయడం నిషిద్ధ. ఈ సమయంలో ఆహారం, పానీయాలు మొదలైన వాటిపై ప్రత్యేక జాగ్రత్తలు పాటించాల్సి ఉంది.