Pitru paksha prabhav: పితృపక్షాలను పదిహేనురోజుల పాటు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 2 వరకు పితృపక్షాల రోజులుగా చెప్పుకొవచ్చు. ఈ పదిహేను రోజుల్లో చనిపోయిన మన పూర్వీకులు తిరిగి భూమ్మిదకు వస్తారని చెబుతుంటారు.
సాధారణంగా పితృపక్షాలలో.. చనిపోయిన మన పూర్వీకులను గుర్తు చేసుకుంటూ ప్రత్యేక కార్యక్రమాలు చేపడతారు. ఈ పదిహేను రోజుల పాటు కూడా పూర్వీకులకు.. ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటారు. చనిపోయిన వారి కోసం వారి వంశస్థులు... బియ్యం, పప్పులు, ఇతర వంట సామాగ్రిని పురోహితులకు దానంగా ఇస్తుంటారు.
మరికొందరు.. గంగా నది, గోదావరి వద్దకు వెళ్లి నదీతీరం వద్ద పూర్వీకుల సంతోషం కూడా శ్రాధ్దకార్యక్రమాలు చేస్తారు. మనం 365 రోజులు అన్నంతింటా. కానీ మన పూర్వీకులకు.. పితృపక్షాల్లో ఒకరోజు అన్నం పెడితే.. ఏడాది అంతా అన్నం పెట్టిన పుణ్యం వస్తుందని చెబుతుంటారు.
అయితే.. ఎవరైన చనిపోయిన తర్వాత లేదా పిండ ప్రదానం చేశాక... కాకి కోసం కూడా ఒక పిండంను పెడతారు. కాకి ముట్టుకుంటేనే చనిపోయిన వారికి ఉత్తమ లోకాలు దొరుకుతాయని, ఆత్మకు శాంతి దొరుకుతుందని చెబుతారు. కానీ కాకి ముట్టకుంటే మాత్రం చనిపోయిన వారికి శాంతి దొరకలేదని భావిస్తారు.
మిగతా సమయంలో కాకి కనిపిస్తే.. తరిమికొట్టే ప్రజలు.. పితృపక్షాల్లో మాత్రం కా.. కా.. అని పిలుస్తారు. దీని వెనుక కాకికి కొన్ని వరాలు ఉన్నాయని చెబుతుంటారు. చనిపోయిన మన పూర్వీకుల ఆత్మలు కాకుల్లో ప్రవేశించ గల్గుతాయంట. అంతేకాకుండా.. కాకి యమ ధర్మరాజు సోదరుడి వాహానం కూడా.. అందుకే కాకి.. మనం పెట్టే అన్నం, ఏదైన పదార్థాలను ముట్టుకుంటే.. చనిపోయిన మన పూర్వీకులు సంతుష్టి చెందినారని భావిస్తారు.
అందుకే చాలా మంది పితృపక్షాల్లో.. కాకిని ఎంతో ప్రత్యేకంగా భావిస్తారు. ఒక వేళ కాకి ముట్టుకుంటే పూర్వీకులు ఆనంద పడ్డారని భావిస్తారు. ఒక వేళ కాకి లేకుంటే.. మరే ఇతర పక్షులు ముట్టుకున్న కూడా అదే ఫలితం వస్తుందని చెబుతుంటారు.
ఒక వేళ కాకి లేదా పక్షులు కూడా ముట్టుకోకుంటే.. ఆవులకు లేదా చివరకు ప్రవహించే నదిలో మనం చేసిన శ్రాధ్దపిండాలను వదిలేయాలని పండితులు చెబుతుంటారు. కానీ కుక్కలకు కానీ, తొక్కే ప్రదేశంలో మాత్రం పిండాలను అస్సలు వేయోద్దని కూడా పండితులు హెచ్చరిస్తున్నారు.
ఈ పదిహేను రోజుల పాటు చనిపోయిన మన పూర్వీకుల కోసం భక్తితో.. ఏది చేసిన కూడా వారు సంతుష్టి చెందుతారు. పేదలకు అన్నదానాలు, ఆవులకు ఏదైన గడ్డి ఇతర పదార్థాలు తినడానికి ఇస్తు ఉండాలి. దీని వల్ల మన జీవితంలో కలిగే అనేక సమస్యలు దూరమౌతాయి. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)