Best Offer: Flipkartలో సగం ధరకే Poco C55 మొబైల్‌..పడిపడి కొంటున్న జనాలు..

Poco C55 Price: ఫ్లిప్‌కార్ట్‌ సంక్రాంతి సందర్భంగా కొన్ని స్మార్ట్ ఫోన్స్‌పై ప్రత్యేకమైన ఆఫర్స్ అందిస్తోంది. ఈ ఆఫర్స్‌లో భాగంగా మొబైల్స్‌ను కొనుగోలు చేస్తే 40 నుంచి 50 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతోపాటు అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

 

Poco C55 Offer: అతి తక్కువ ధరకి మంచి ప్రీమియం ఫీచర్స్ కలిగిన మొబైల్ ని కొనుగోలు చేయాలనుకునే వారికి ఫ్లిప్‌కార్ట్‌ సువర్ణ అవకాశాన్ని అందించబోతోంది. ఫ్లిప్‌కార్ట్‌ సంక్రాంతి పండగ సందర్భంగా ప్రత్యేక సేల్‌ నిర్వహిస్తోంది. ఈ సేల్ లో భాగంగా ఎలక్ట్రిక్ వస్తువులపైనే కాకుండా స్మార్ట్ ఫోన్‌లకు కూడా ప్రత్యేక డిస్కౌంట్ అందిస్తోంది. అయితే ఈ ప్రత్యేక సేల్‌ అత్యంత తక్కువ ధరతో లభిస్తున్న మొబైల్ ఏంటో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. 
 

1 /6

ఫ్లిప్‌కార్ట్‌లోని జరుగుతున్న బిగ్ బజార్ సేల్‌లో భాగంగా కొన్ని ప్రత్యేకమైన బ్రాండ్లకు సంబంధించిన స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేస్తే 30 నుంచి 40 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది. అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్‌ కొన్ని స్మార్ట్ ఫోన్స్‌పై బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉంచింది. ముఖ్యంగా ఈ సేల్‌లో రెడ్‌ మీ అనుసంధాన బ్రాండ్ పోకోకు సంబంధించిన స్మార్ట్‌ఫోన్స్ అతి తక్కువ ధరలు లభిస్తున్నాయి.

2 /6

ఇటీవలే పోకో విడుదల చేసిన Poco C55 స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభించనున్నాయి. ఈ మొబైల్ అసలు ధర రూ.11,999కాగా ఫ్లిప్‌కార్ట్‌ నిర్వహిస్తున్న ప్రత్యేక డీల్‌లో భాగంగా 45 శాతం తగ్గింపుతో లభిస్తోంది.  

3 /6

ప్రస్తుతం ఈ Poco C55 స్మార్ట్ ఫోన్ 45 శాతం తగ్గింపు పోను కేవలం రూ. 6,499 అందుబాటులో ఉంది. దీంతోపాటు అదనంగా డిస్కౌంట్ పొందడానికి ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డును వినియోగించి బిల్ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చెల్లిస్తే రూ.325 వరకు తగ్గింపు లభిస్తుంది.  

4 /6

ప్రస్తుతం ఈ Poco C55 స్మార్ట్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రెండు రకాల వేరియంట్లలో అందుబాటులో ఉంది. మొదటి వేరియంట్ 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటే.. రెండవ వేరియంట్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది. 

5 /6

ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ విషయానికొస్తే..ఈ మొబైల్ Mediatek Helio G85 Octa Core ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. అంతేకాకుండా 6.7 అంగుళాల శక్తివంతమైన డిస్ప్లేను కలిగి ఉంటుంది. అయితే ఈ మొబైల్ కేవలం 4జి కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. 

6 /6

కెమెరా విషయానికొస్తే ఈ Poco C55 స్మార్ట్ ఫోన్ వెనక భాగంలో 50MP బ్యాక్ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు అదనపు కెమెరా సెన్సార్ ను కూడా అందిస్తోంది. అంతేకాకుండా 5MP ఫ్రంట్ కెమెరాను కూడా కలిగి ఉంటుంది.