Post Office Schemes 2023: ఈ పథకాలలో పెట్టుబడి పెట్టండి.. భారీ లాభాలు పొందండి

Post Office Scheme Interest Rates 2023: పోస్టాఫీసు ద్వారా ప్రజలకు వివిధ రకాల సేవలు అందుతున్నాయి. ప్రజలు పెట్టుబడి పెట్టాలనుకుంటే పోస్టాఫీసులో అనేక పథకాలు మంచి వడ్డీరేటు అందిస్తున్నాయి. ఏ పథకంలో పెట్టుబడి పెడితే ఎంత వడ్డీ వస్తుందో తెలుసుకుందాం..
 

  • Feb 11, 2023, 23:10 PM IST
1 /5

పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాపై 4 శాతం వడ్డీ ప్రయోజనాన్ని ఖాతాదారులు పొందుతారు. దీంతో పాటు పోస్టాఫీసు ఆర్డీలో కస్టమర్‌లు 5.80 శాతం వడ్డీని పొందుతారు.   

2 /5

పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ స్కీమ్‌పై 7 శాతం వడ్డీ లభిస్తోంది.నెలవారీ పొదుపు పథకంలో 7.10 శాతం వడ్డీని పొందుతున్నారు.   

3 /5

సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌పై వినియోగదారులకు పోస్టాఫీసు 8 శాతం వడ్డీని చెల్లిస్తోంది. అదేవిధంగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌పై 7.10 శాతం చొప్పున వడ్డీని పొందుతుంది.   

4 /5

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌లో పెట్టుబడి పెట్టే వారికి 7 శాతం వడ్డీ లభిస్తుంది. కిసాన్ వికాస్ పత్రలో డబ్బు పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులు 7.20 శాతం వడ్డీని పొందుతారు.   

5 /5

కేంద్ర ప్రభుత్వ పథకం సుకన్య సమృద్ధి యోజనలో వడ్డీ 7.60 శాతం చొప్పున అందుతోంది. ఈ పథకంలో కనీస పెట్టుబడి 250 రూపాయలు.