Postal Life Insurance Benefits: ప్రస్తుతం అంతా లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ (LIC) పాలసీలు చేస్తున్నారు. పదే పదే ఎల్ఐసీ ఇన్సూరెన్స్ పాలసీల గురించి వింటూంటాం కానీ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (Postal Life Insurance) 1884లోనే వచ్చిందన్న విషయం అంతగా ఎవరికీ తెలియదు. ఇందులోనూ పాలసీలు చేసుకుంటే దాదాపు రూ.50,00,000 వరకు ఉన్నాయి ఇందులో చిల్డ్రన్ పాలసీ, హోల్ లైఫ్ ఇన్సూరెన్స్, ఎండోమెంట్ అష్యూరెన్స్, జాయింట్ లైఫ్ ఇన్సూరెన్స్, కన్వర్టబుల్ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్, యాంటిసిపేటెడ్ ఎండోమెంట్ అష్యూరెన్స్ లాంటి ఆరు రకాల పాలసీలు ఉన్నాయి.
పోస్టాఫీసు (Post Office) అందిస్తున్న Joint Life Assurance (Yugal Suraksha) - ఇది జాయింట్ లైఫ్ ఎండోమెంట్ అష్యూరెన్స్ పాలసీ. భార్యాభర్తలలో ఒకరు తీసుకుంటే మరొకరికి పాలసీ బెనిఫిట్స్ లభిస్తాయి. భార్యాభర్తలు ఇద్దరికీ లైఫ్ కవర్‌తో పాటు బోనస్ అందుకోవచ్చు. పాలసీకి కనీస వయసు 21 ఏళ్లు కాగా, గరిష్ట వయసు- 45 ఏళ్లుగా ఉంది. ఇందులో కనిష్టంగా రూ.20,000, గరిష్టంగా రూ.50,00,000 అందుకోనున్నారు. పాలసీ తీసుకున్న మూడేళ్ల అనంతరం లోన్ తీసుకోవచ్చు. అవసరమైతే పాలసీ తీసుకున్న మూడేళ్ల తర్వాత సరెండర్ చేయవచ్చు. ఏడాదికి రూ.1,000 కి రూ.85 బోనస్ అందుకుంటారు.
Anticipated Endowment Assurance (Sumangal). యాంటిసిపేటెడ్ ఎండోమెంట్ అష్యూరెన్స్ - LIC అందిస్తున్నట్లుగానే పోస్టాఫీసులో మనీ బ్యాక్ పాలసీ ఇది. గరిష్టంగా రూ.50,00,000 వరకు అష్యూర్డ్ ఉంటుంది. పాలసీదారుడు తమ అవసరాలకు తగ్గట్లుగా మనీ బ్యాక్ పొందవచ్చు. డెత్ బెనిఫిట్స్ కింద నామినీకి డబ్బులు అందిస్తారు. పాలసీ గడువు : కనిష్టంగా 15 ఏళ్లు, గరిష్టంగా 20 ఏళ్లు. పాలసీదారులకు కనీస వయసు- 19 ఏళ్లు కాగా, గరిష్ట వయసు - 40 ఏళ్లు. అయితే 15 ఏళ్ల పాలసీ అయితే గరిష్ట వయసు 45ఏళ్లు. అష్యూర్డ్ మనీ కనిష్టంగా రూ.20,000, గరిష్టంగా అష్యూర్డ్ మనీ రూ.50,00,000గా ఉంది. 15 ఏళ్ల పాలసీదారులకు 6, 9, 12 ఏళ్లకు 20 శాతం చొప్పున బోనస్ లభిస్తుంది. మెచ్యూరిటీ సమయంలో మిగతా 40 శాతం బోనస్, మెచ్యూరిటీ అందుకుంటారు. 20 ఏళ్లకు పాలసీదారులకు 8, 12, 16 ఏళ్లకు 20 శాతం చొప్పున బోనస్ లభిస్తుంది. మెచ్యూరిటీ సమయంలో 40 శాతం బోనస్‌తో కలిపి మెచ్యూరిటీ వస్తుంది. ఏడాదికి రూ.1,000 కి రూ.53 బోనస్ అందుతుంది.
Suraksha పాలసీదారులకు 80 ఏళ్లు వయసు రాగానే పాలసీ నగుదు అందిస్తారు. పాలసీదారుడు మరణిస్తే గతంలో పేర్కొన్న నామినీకి అష్యూర్డ్ మనీతో పాటు బోనస్ లభిస్తుంది. ఇందులో కనీస వయస్సు- 19 ఏళ్లు కాగా, గరిష్ట వయస్సు- 55 ఏళ్లు. Suraksha పాలసీలో కనిష్టంగా రూ.20,000 గరిష్టంగా రూ.50,00,000 వరకు పాలసీ ఉంటాయి. వీరికి లోన్ సదుపాయం ఉంటుంది. అవసరమైతే పాలసీని సరెండర్ కూడా చేయవచ్చు. వీరికి రూ.1000కి రూ.85 మేర బోనస్ ఉంటుంది.
Endowment Assurance (Santosh) పాలసీ తీసుకుంటే ఇందులో మెచ్యూరిటీ వయసు 35, 40, 45, 50, 55, 58 మరియు 60 ఏళ్లుగా ఉన్నాయి. మీరు తీసుకున్న మెచ్యూరిటీ ప్రకారం నగదు అందుతుంది. ఒకవేళ పాలసీదారుడు మరణిస్తే నామినీకి, లేక వారికి చెందిన వ్యక్తికి డబ్బులు వస్తాయి. ఇందులో కనీస వయస్సు- 19 ఏళ్లు కాగా, గరిష్ట వయస్సు- 55 ఏళ్లు Endowment Assurance పాలసీలో కనిష్టంగా రూ.20,000 గరిష్టంగా రూ.50,00,000 వరకు పాలసీ ఉంటాయి. వీరికి లోన్ సదుపాయం ఉంటుంది. వీరికి లోన్ సదుపాయం ఉంటుంది. పాలసీ తీసుకున్న మూడేళ్ల తర్వాత లోన్ పొందవచ్చు. అవసరమైతే మూడేళ్ల తరువాత పాలసీని సరెండర్ కూడా చేయవచ్చు. వీరికి ఏడాదికి రూ.1000కి రూ.58 మేర బోనస్ ఉంటుంది. Also Read: Benifits Of EPF Account: మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా.. ఈ బెనిఫిట్స్ తెలుసా!
Convertible Whole Life Assurance (Suvidha). ఇది కన్వర్టబుల్ పోస్టల్ ఇన్సూరెన్స్ పాలసీ. మీరు తొలుత హోల్ లైఫ్ అష్యూరెన్స్ పాలసీ తీసుకుని.. ఐదేళ్ల తర్వాత ఎండోమెంట్ అష్యూరెన్స్ పాలసీగా మార్చుకునే సదుపాయం ఉంది. మెచ్యూరిటీ తర్వాత పాలసీ నగదు చేతికి అందుతుంది. ఒకవేళ పాలసీదారుడు చనిపోతే పాలసీలో పేర్కొన్న నామినీకి డబ్బులు వస్తాయి. ఇందులో కనీస వయస్సు- 19 ఏళ్లు కాగా, గరిష్ట వయస్సు- 50 ఏళ్లు. Convertible Whole Life Assurance పాలసీలో కనిష్టంగా రూ.20,000 గరిష్టంగా రూ.50,00,000 వరకు పాలసీ ఉంటాయి. వీరికి లోన్ సదుపాయం ఉంటుంది. పాలసీ తీసుకున్న నాలుగేళ్ల తర్వాత లోన్ తీసుకోవచ్చు. అవసరమైతే మూడేళ్ల అనంతరం పాలసీని సరెండర్ కూడా చేయవచ్చు. వీరికి రూ.1000కి రూ.85 మేర ప్రతి ఏడాది బోనస్ లభిస్తుంది. Also Read: Best LIC Policies: 5 బెస్ట్ ఎల్ఐసీ పాలసీలు ఇవే.. మీరూ ఓ లుక్కేయండి
చిన్నారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పాలసీ బాల్ జీవన్ భీమా (Bal Jeevan Bima). గరిష్టంగా తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలకు ఈ పాలసీ తీసుకోవచ్చు. తల్లిదండ్రుల పేరు మీద పాలసీ ఇస్తారు. కనిష్ట వయసు 5 ఏళ్లు కాగా, గరిష్టంగా 20 ఏళ్లు వరకు పాలసీ తీసుకోవచ్చు. మొత్తం రూ.3,00,000 మేర అష్యూర్డ్ చేస్తారు. Bal Jeevan Bima పాలసీ మధ్యలోనే తల్లిదండ్రులు మరణిస్తే ప్రీమియం తదుపరి ఇన్‌స్టాల్‌మెంట్స్ కట్టాల్సిన పనిలేదు. పాలసీ గడువు పూర్తయ్యాక అష్యూర్డ్ నగదుతో పాటు బోనస్ చేతికి అందుతుంది. Also Read: Read Also: EPFO: మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలియదా.. అయితే UAN యాక్టివేట్ చేసుకోండి