Pragya Jaiswal Instagram pics: కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకునే నటిమణులు చాలా తక్కువ మంది ఉంటారు.. అయితే ఆ జాబితాలో చాలా సులువుగా స్థానం సంపాదించుకుంది ఈ హీరోయిన్. ఆ తరువాత ఎన్నో చిత్రాలలో కనిపించిన ఈ భామ.. ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు తెగ అలరిస్తున్నాయి.
వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన కంచె ..సినిమాతో తనకంటూ ప్రత్యేక స్నానం సంపాదించుకున్న హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. ఈ చిత్రంతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల మదిలో ఫేవరెట్ హీరోయిన్గా నిలిచిపోయింది. అయితే ఆ సినిమా తరువాత ఈ హీరోయిన్ కి అనుకుందని విషయాలు మాత్రం రాలేదు.
ఇక ఈ మధ్యనే బాలకృష్ణతో చేసిన అఖండ చిత్రం ఈ హీరోయిన్ కి మంచి విజయం అందించింది. ఇక ఈ సినిమాకి త్వరలోనే రెండో భాగం కూడా రానుంది. ఈ రెండో భాగంలో కూడా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించడం విశేషం.
అంతేకాదు బాలకృష్ణ హీరోగా చేస్తున్న డాకూ మహారాజ్ చిత్రంలో కూడా.. ప్రజా జైష్వాల్ హీరోయిన్ గా నటించనుంది. ఈ సినిమా ఈ సంవత్సరం.. సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది.
ఈ సినిమా ప్రగ్యా కి మరో విజయం అందిస్తే.. ఇక ఈ హీరోయిన్ కి తప్పకుండా తెలుగులో మరిన్ని అవకాశాలు రావడం ఖాయంలా కనిపిస్తున్నాయి. కాగా సినిమాల విషయం పక్కన పెడితే తన ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా తరచూ ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ హీరోయిన్.
తాజాగా న్యూ ఇయర్ రోజు ప్రముఖ హీరోయిన్ రకుల్ తో కలిసి ప్రగ్యా షేర్ చేసిన ఫోటోలు అందరిని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. న్యూ ఇయర్ ని తెగ ఎంజాయ్ చేస్తూ ఆమె అభిమానులకు విషెస్ తెలుపుతూ ఫోటోలను షేర్ చేసింది ఈ హీరోయిన్.