Ramya Krishnan Photoshoot : కొప్పున పూలు.. నిండైన చీరకట్టు.. శివగామి లుక్స్ అదుర్స్

Ramya Krishnan Photoshoot సీనియర్ నటి రమ్యకృష్ణ తాజాగా చేసిన ఫోటో షూట్ చూస్తే అందరూ ఫిదా అవ్వాల్సిందే. ప్రీతమ్ జుకల్కర్ డిజైన్ చేసిన ఈ చీరలో రమ్యకృష్ణ అదుర్స్ అనిపించేలా ఉంది.

  • Nov 05, 2022, 17:55 PM IST
1 /5

నటి రమ్యకృష్ణకు బాహుబలి సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. శివగామి పాత్రలో రమ్యకృష్ణ చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు.

2 /5

రమ్యకృష్ణకు సీనియర్ హీరోయిన్‌గా ఉన్న క్రేజ్ కంటే ఇప్పుడు శివగామి పాత్రతో వచ్చిన ఇమేజ్ ఎక్కువ అయింది. ఇప్పటి తరానికి రమ్యకృష్ణ అంటే శివగామిగానే చూస్తుంటారు.

3 /5

రమ్యకృష్ణ తన సెకండ్ ఇన్నింగ్స్‌ను అంత కరెక్ట్‌గా ప్లాన్ చేసుకున్నట్టుగా అనిపించడం లేదు. ఆమె ఇంత వరకు మరో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంలో నటించలేకపోయింది.

4 /5

సోషల్ మీడియాలో రమ్యకృష్ణకు మాత్రం మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె తన పర్సనల్ ఫోటోలు, ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తుంటుంది. తన భర్త కృష్ణవంశీ, కొడుకు ఫోటోలను షేర్ చేస్తుంటుంది.

5 /5

రమ్యకృష్ణ ప్రస్తుతం బుల్లితెర షోలు, ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద షోలు చేసుకుంటూ బిజీగా ఉంటోంది. అందులో వింత వింత డ్రెస్సులు వేసుకుంటోంది. తాజాగా ఇలా కొప్పున పూలు పెట్టుకుని కనిపించింది.