Raksha bandhan 2024: రక్షా బంధన్ వేళ.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఫన్నీ మీమ్స్..

Raksha bandhan funny memes: రాఖీ పౌర్ణమి అనేది సోదరులు, సోదరీమణుల మధ్య ప్రేమను చాటుకునే గొప్ప పండుగ. ఈరోజు తమ సోదరులు ఎక్కడున్న తప్పనిసరిగా వాళ్ల అక్కలు, చెల్లెళ్లు వెళ్లి రాఖీలు కడుతుంటారు.
 

1 /8

మనదేశంలో అనాదీగా అనేక ఆచారాలు , సంప్రదాయాలు పాటిస్తుంటారు. మనం సెలబ్రేట్ చేసుకునే ప్రతి పండుగ వెనుకాల మంచి కారణాలు ఉంటాయి. ఇదిలా ఉండగా.. శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున శ్రావణ పౌర్ణమి రోజున రాఖీ పండుగను తప్పనిసరిగా జరుపుకుంటారు.ఈ సారి ఆగస్టు 19 న రాఖీ పండుగను జరుపుకుంటాము.

2 /8

రాఖీ పండుగ వేళ సాధారణంగా అన్నతమ్ముళ్లు, తమ అక్కా చెల్లెళ్లతో రాఖీలు కట్టించుకుంటారు. అంతేకాకుండా, మంచి గిఫ్ట్ లతో వారిని సర్ ప్రైజ్ చేస్తుంటారు. మరోవైపు రాఖీ పండుగ రాగానే సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ లు తరచుగా వైరల్ అవుతుంటాయి. తాజాగా, మరోసారి కొన్ని మీమ్స్ ట్రెండింగ్ గా మారాయి. 

3 /8

సాధారణంగా చాలా మందికి జీవితంలో తప్పనిసరిగా ఒకరిమీద క్రష్ ఉంటుంది. వారికి చెప్పకున్న.. మనస్సులో మాత్రం వారిని లవ్ చేస్తుంటారు. కానీ కొంత మంది అమ్మాయిలు మాత్రం.. ఇలాంటి వాటి నుంచి ఎస్కేప్ అవ్వడానికి రాఖీని ఉపయోగించుకుంటారు. ఎవరైన తమకు లైటింగ్ కొట్టినట్లు, తమను ఫాలో అవుతున్నట్లు ఏమాత్రం డౌట్ వచ్చిన కూడా రాఖీ రోజు అమ్మాయిలు రివేంజ్ తీర్చుకుంటారు.

4 /8

తమకు ట్రై చేస్తున్న అబ్బాయిలకు రాఖీలు కట్టేసి, వారి ఆశలను, అడియాశలు చేస్తుంటారు.అందుకు రాఖీ రోజు అబ్బాయిలు చాలా మంది అమ్మాయిలు, ముఖ్యంగా తాము లవ్ చేస్తున్న అమ్మాయిల కంట పడకుండా జాగ్రత్తగా ఉంటారు.  

5 /8

ఇంకా కొంత మంది అమ్మాయిలు రాఖీ పండుగ వస్తుందంటే సంబర పడిపోతుంటారు. తమ కజిన్స్ లేదా అన్న వరుస వాళ్లకు రాఖీలు కడితే తమకు ఎన్నిడబ్బులు వస్తాయో అనిముందుగానే ప్లాన్ లు చేసుకుంటారు. ఆ డబ్బులుతో ఏ డ్రెస్ కొనుక్కొవాలి.. ఎక్కడ షాపింగ్ చేయాలి అనే ప్లాన్ లోనే ఉంటారు. 

6 /8

అందుకు కొంత మంది బాయ్స్ చాలా స్మార్ట్ గా ఉంటారు. రాఖీ రోజు మాత్రం.. అమ్మాయిలకుఅస్సలు దొరకరు. ఏవో కారణాలు చెబుతూ ఎస్కేప్ అయిపోతుంటారు. కొంత మంది నార్మల్ డేస్ లలో పట్టించుకొని వారంతా.. రాఖీ రోజు మాత్రం రాఖీలమెస్సెజ్ లు పంపితే నవ్వాలో .. ఏడ్వాలో అర్థంకాక.. వెరైటీగా రియాక్ట్ అవుతుంటారు.

7 /8

కానీ రాఖీ పండుగ అనేది సోదరులు,సోదరీమణుల మధ్య ప్రేమనుచాటుకునే గొప్ప పండగ. రాఖీ కట్టడం ద్వారా తనవాళ్లకి ఒక కంకణం మాదిరిగా రక్షణగాగా ఉండాలని కట్టాలని పండితులు చెబుతున్నారు. అలాగే తమ అక్కా, చెల్లేళ్లకు జీవితాంతం కష్టసుఖాల్లో నేనున్నానని భరోసాను అన్న లేదా తమ్ముడు ఇవ్వాలని చెబుతుంటారు.

8 /8

తల్లిదండ్రుల తర్వాత తమ సోదరుడు, సోదరీమణులు ఒకరికి ఒకరు అండగా ఉంటూ.. జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవడంతో ఒకరికి మరోకరు సహాయం చేసుకొవాలని కూడా చెబుతుంటారు. అందుకే రాఖీ రోజున తమ వాళ్లు ఎక్కడున్న సరే.. చివరకు పోస్ట్ తో అయిన రాఖీ ని పంపించి తమ ప్రేమను, అనురాగాన్ని చాటుకుంటారు.