Prachi Tehlan: రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడి సినిమా ద్వారా పరిచయం…వైరల్ అవుతున్న బ్యూటీ ఫోటోలు!

Prachi Tehlan Instagram Pics: రకుల్‌ ప్రీత్‌ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్‌ సింగ్‌ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. కాగా అమన్ ప్రీత్ సింగ్ నటించిన త్రిశంకు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్..ప్రాచీ టెహ్లాన్‌. ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. 

1 /5

అమన్ ప్రీత్‌ సింగ్‌ హీరోగా చేసిన త్రిశంకు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్..ప్రాచీ టెహ్లాన్‌. సినిమాలతోనే కాదు తన ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా కూడా తెగ అలరిస్తూ ఉంటుంది ఈ హీరోయిన్. ఎప్పటికప్పుడు ఈ భామ ట్రెండీ, హాట్ లుక్స్‌లో అలరిస్తూ.. నెటిజన్లకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది.

2 /5

ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో.. తరచుగా ఫోటోలు షేర్ చేస్తూ అందరిని తెగ ఆకట్టుకుంటు ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా.. ఈ నటి.. దివి నుంచి భూమికి దిగివచ్చిన శిల్పంలా.. వైట్ అండ్ వైట్ డ్రెస్ లో షేర్ చేసిన ఫోటోలు.. ఆమె అభిమానులను మరింత ఆకట్టుకుంటున్నాయి. 

3 /5

వైట్ లెహంగాలు ఏంజెల్ లాగా మెరిసిపోతూ కెమెరాకు ఫోజులిచ్చింది. కాటుక కనులతో సోఫాపై హొయలుపోయింది. ఈ ఫోటోలు చూసినవారు ఎవరైనా సరే.. ఈ ఫోటోల నుంచి క్షణం కూడా కళ్ళు తిప్పుకోలేనంతగా.. తన అందంతో ఫిదా చేసింది ఈ హీరోయిన్.   

4 /5

కాగా ప్రస్తుతం ఈ నటి..జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మలయాళ స్టార్ హీరో మోహన్‌ లాల్‌ నటిస్తోన్న భారీ ప్రాజెక్టు రామ్‌ లో కీలక పాత్రలో కనిపించనుంది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రం చాలా కాలం క్రితమే లాంచ్ కాగా.. ప్రస్తుతం ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ త్వరలో రానున్నాయి. 

5 /5

అయితే ప్రస్తుతం ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు చూస్తున్న సినీ ప్రేక్షకులు.. ఈ హీరోయిన్ కి తప్పకుండా సినిమా ఇండస్ట్రీలో మంచి ఫ్యూచర్ ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి తెలుగులో కూడా.. ఈ నటి.. భవిష్యత్తులో భారీ ప్రాజెక్టులు సొంతం చేసుకుంటుందో.. లేదో వేచి చూడాలి.