Ram Charan: రామ్ చరణ్ ఫేవరెట్ హీరో, హీరోయిన్ ఎవరో తెలుసా..? అతని జీవితం ఆ సినిమా లాగా ఉంటుందంట..!

Ram Charan interview: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకి బాగా ఇష్టమైన హీరో హీరోయిన్ల.. పేర్లతో పాటు.. తను చేసిన సినిమాలు తనకి ఇష్టమైన సినిమా ఏంటో కూడా రివీల్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాపిడ్ ఫైర్ రౌండ్ లో భాగంగా.. రామ్ చరణ్ ఈ విషయాలను అభిమానులతో పంచుకున్నారు. 

1 /5

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత.. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు. తాజాగా రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. 

2 /5

రాపిడ్ ఫైర్ రౌండ్ లో భాగంగా రామ్ చరణ్ కు.. మిమ్మల్ని ఓజీ గా చూపించిన సినిమా ఏది అనే ప్రశ్న ఎదురైంది. "జనాలకి కొన్ని సినిమాలు నచ్చాయి. కానీ నాకు ఇంకొన్ని సినిమాలు నచ్చాయి. కాబట్టి నాకు తెలియదు. నేను ఎలా ఉండాలి అనుకుంటున్నాను అంటే.. నాకు రంగస్థలం, ఆరెంజ్ సినిమాలు ఇష్టం. కానీ మగధీర నా ల్యాండ్ మార్క్ సినిమా. కాబట్టి జనాలకి ఇష్టం కాబట్టి మగధీర అని చెబుతాను" అని అన్నారు రామ్ చరణ్.   

3 /5

యాక్షన్ లేదా రొమాన్స్ ఎలాంటి సినిమాలు ఇష్టపడతారు అని అడగగా రామ్ చరణ్ యాక్షన్ అని చెప్పారు. థ్రిల్లర్ ఆర్ కామెడీ అని అడిగితే రామ్ చరణ్ కామెడీ అని చెప్పారు. తను ఇప్పటిదాకా ఎక్కువ కామెడీ ఉన్న సినిమాలు చేయలేదు అని.. కానీ బుచ్చిబాబు సినిమాలో కామెడీ ఎక్కువగా ఉంటుంది అని బయట పెట్టేసారు. 

4 /5

బుక్స్ లేదా ప్లే స్టేషన్ అని అడగగా.. తనకి గేమ్స్ పెద్దగా ఇష్టం లేదు అని బుక్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను అని చెప్పారు రామ్ చరణ్. ఏదైనా బుక్ రికమెంట్ చేస్తారా అని అడగగా.. హూ మూవ్డ్ మై చీజ్ అని చెప్పారు చెర్రీ. తన ఫేవరెట్ యాక్టర్ ఎవరు అని అడగగానే వెంటనే సూర్య తమిళ్ యాక్టర్ సూర్య అని చెప్పేసారు రామ్ చరణ్. 

5 /5

ఇక అభిమాన హీరోయిన్ గురించి అడిగితే రామ్ చరణ్ తనకి అందరూ ఇష్టమేనని.. కానీ ప్రెసెంట్ జనరేషన్ లో సమంత బాగా నచ్చుతుంది… అని అన్నారు రామ్ చరణ్. ఇద్దరూ కలిసి రంగస్థలం సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.