Ram charan karapa dargah controversy: హీరో రామ్ చరణ్ ప్రస్తుతం అయ్యప్ప స్వామి మాల ధారణలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇటీవల కడప దర్గాను సందర్శించడం వివాదాస్పదంగా మారింది. దీనిపై ఆయన సతీమని ఉపాసన ఎక్స్ వేదికగా స్పందిచారు.
మెగా హీరో రామ్ చరణ్ తాజాగా కడప దర్గాను సందర్శించడం పెనుదుమారంగా మారింది. సోషల్ మీడియాలో రామ్ చరణ్ తీరును నెటిజన్ లు ఏకీపారేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రామ్ చరణ్ అయ్యప్ప మాలధారణలోఉన్న విషయం తెలిసిందే.
రామ్ చరణ్ ఇటీవల కడపకు వెళ్లి అక్కడ దర్గాను సందర్శించి చాదర్ సైతం సమర్పించుకున్నారు. ఇది వివాదస్పదంగా మారడానికి ప్రధాన కారణం రామ్ చరణ్ అయ్యప్ప మాలధారణలో ఉండటమే. ఆయన నార్మల్ గా ఉన్నప్పుడు దర్శించుకుంటే ఇంత వివాదాస్పదంగా మారేది కాదేమో అని కొందరు అంటున్నారు.
అయ్యప్ప స్వామిని మాలను మండలం రోజులు వేసుకుంటారు. ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇరుముడి ధరించి శబరి మాలను సైతం వెళ్తుంటారు. రామ్ చరణ్ ఇటీవల గేమ్ చేంజర్ మూవీని పూర్తి చేసుకున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా రానున్నట్లు తెలుస్తొంది.
మ్యూజీక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ పిలుపు మేరకు.. రామ్ చరణ్ కడప దర్గాను సందర్శించినట్లు తెలుస్తొంది. ఆయన అయ్యప్ప మాలధారణలో దర్గాను సందర్శించడం వివాదంగా మారింది. హిందువులు, అయ్యప్ప భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా రామ్ చరణ్ ప్రవర్తించాడని నెటిజన్లు ఎక్స్ లో ఫైర్ అవుతున్నారు.
దీనిపై తాజాగా, రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తొంది..'విశ్వాసం అనేది అందర్నీ కలిపి ఉంచేదే తప్ప విడదీసేది ఉండొద్దని ఆమె పోస్ట్ పెట్టారు. భారతీయులంతా కొలిచే దేవుళ్లు, విధానాలు, ఆచారలు వెరైన కూడా.. చివరకు చేరుకునే గమ్యం మాత్రం ఒక్కటే అని అన్నారు.
ఈ క్రమంలో.. మన బలం ఐక్యతలోనే ఉందని.. రామ్ చరణ్ తన ధర్మాన్ని ఆచరిస్తూనే ఇతర మతాల్ని కూడా అంతే గౌరవిస్తారని ఉపాసన ఎక్స్ వేదికగా సంచలన పోస్ట్ పెట్టి క్లారిటీ ఇచ్చారు.
కొంత మంది నెటిజన్ లు, అయ్యప్ప భక్తులు రామ్ చరణ్ కు సపోర్ట్ చేస్తున్నారు. శబరి మాల వెళ్లేటప్పుడు.. వావర్ అనే ముస్లిం దర్గాను సందర్శించి వెళ్తుంటారని, అయ్యప్ప స్వామి ఆయనను అనుగ్రహించాడని చెప్తుంటారు. అప్పుడు దర్శనం చేసుకొని వెళ్లేటప్పుడు లేని ఇబ్బంది.. ఇప్పుడు దర్శనం చేసుకుంటే వచ్చిన బాధ ఏంటని కూడా మండిపడుతున్నారు.