Rashmika Mandanna Latest Pics: డీప్ ఫేక్ వీడియోతో మరోసారి వార్తల్లో నిలిచింది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ఏఐ సాయంతో ఆమె ముఖంతో ఓ ఫేక్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో రష్మికకు మద్దతు సినీ, రాజకీయ ప్రముఖులు గళమెత్తారు. టెక్నాలజీ దుర్వినియోగంపై ఆందోళన వ్యక్తం చేశారు.
తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ పేరుపేరున రష్మిక ధన్యవాదాలు తెలిపింది. టెక్నాలజీ ద్వారా ఇలాంటి పనులు చేయడం తనకు భయమేస్తోందని తెలిపింది.
ఇలాంటి విషయం గురించి మాట్లాడాలంటే చాలా బాధగా ఉందని.. స్కూల్, కాలేజీలో ఉన్నప్పుడు ఇలా జరిగి ఉంటే ఎలా తట్టుకోగలనో తన ఊహకు అందడం లేదని చెప్పింది.
ఈ డీప్ ఫేక్ వీడియో ఎఫెక్ట్ నుంచి రష్మిక త్వరగానే బయటపడినట్లు తెలుస్తోంది. తాజాగా వర్కౌట్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
పొట్టి డ్రెస్‌లో క్రేజీ ఎక్సర్‌సైజ్‌లతో అదరగొట్టింది. ఈ వీడియో నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తోంది.
మీరు బాగా వర్కౌట్ చేసినప్పుడు.. ఆ రోజు మంచిగా ఉంటుంటుందని మీకు అనిపిస్తుందని క్యాప్షన్ ఇచ్చింది నేషనల్ క్రష్.